ఆఖరి మజిలీకి అవస్థలే..
ABN , Publish Date - Mar 06 , 2026 | 11:08 PM
ఆ గ్రామ ప్రజలకు ఆఖరి మజిలీకి చేరాలన్న అవస్థలు తప్పడం లేదు. మండలంలోని ఆర్.కొత్తపల్లె గ్రామంలో హిందువుల శ్మశాన వాటికకు వెళ్లేందు కు పొలాలు, వాగులు దాటాల్సిన పరిస్థితి నెలకొంది.
పొలాలు, వాగులు దాటాల్సిందే
రుద్రవరం, మార్చి 6 (ఆంధ్రజ్యోతి) : ఆ గ్రామ ప్రజలకు ఆఖరి మజిలీకి చేరాలన్న అవస్థలు తప్పడం లేదు. మండలంలోని ఆర్.కొత్తపల్లె గ్రామంలో హిందువుల శ్మశాన వాటికకు వెళ్లేందు కు పొలాలు, వాగులు దాటాల్సిన పరిస్థితి నెలకొంది. శుక్రవారం గ్రామానికి చెందిన సూర్యనారాయణరెడ్డి (68) అనే వృద్ధుడు అనారోగ్యంతో మృతి చెందాడు. అంత్యక్రియలు నిర్వహిం చాలంటే పొలాలు, వాగులు దాటాలి. పాడె మోసేందుకు బంధువులు, గ్రామస్థులు నానా అవస్థలు పడ్డారు. గ్రామంలో వంద కుటుంబాలకు అదే శ్మశాన వాటిక. అక్కడికి వెళ్లాలంటే ఎన్నో కష్టాలు పడాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.