నీటి కోసం పోరాటం
ABN , Publish Date - Apr 18 , 2026 | 11:40 PM
హొళగుంద గ్రామశివారులో తుంగభద్ర ఎల్లెల్సీ, కడ్లమాగి వద్ద ఎస్‌ఎస్ ట్యాంకు ఉన్నా తమ కాలనీకి 20 రోజుల నుంచి తాగునీటి సరఫరా కావడం లేదని బీసీ కాలనీలోని మహిళలు శనివారం సాయంత్రం ఖాళీ బిందెల తో ఆదోనికి వెళ్లే రోడ్డుపై ధర్నా చేపట్టారు.
20 రోజులకోసారి తాగునీటి సరఫరా
ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన హొళగుంద బీసీ కాలనీ మహిళలు
హొళగుంద, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): హొళగుంద గ్రామశివారులో తుంగభద్ర ఎల్లెల్సీ, కడ్లమాగి వద్ద ఎస్‌ఎస్ ట్యాంకు ఉన్నా తమ కాలనీకి 20 రోజుల నుంచి తాగునీటి సరఫరా కావడం లేదని బీసీ కాలనీలోని మహిళలు శనివారం సాయంత్రం ఖాళీ బిందెల తో ఆదోనికి వెళ్లే రోడ్డుపై ధర్నా చేపట్టారు. 20 రోజులుగా తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారని వాపోయారు. దాదాపు గంటపాటు రోడ్డుపై వారు బైఠాయించడంతో ట్రాఫిక్ స్తంభించింది. అధికారులు స్పందించకపోతే ఎంపీడీఓ కార్యాల యం ముట్టడి తప్పదని మహిళలు హెచ్చరించారు.