Share News

‘ఉపాధి’ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలి

ABN , Publish Date - Jan 14 , 2026 | 11:19 PM

ఉపాధి హామీ పథకాన్ని యథావిఽధిగా కొనసాగించాలని సీపీఎం పట్టణ కార్యదర్శి నక్కి శ్రీకాంత, సీఐటీయూ నాయకులు మాణిక్యంశెట్టి, శివరాం, నాగమద్దయ్య, డిమాండ్‌ చేశారు.

‘ఉపాధి’ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలి
బేతంచెర్ల: జీవో పత్రులను భోగి మంటల్లో వేస్తున్న సీఐటీయూ నాయకులు

డోన రూరల్‌ జనవరి 14 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకాన్ని యథావిఽధిగా కొనసాగించాలని సీపీఎం పట్టణ కార్యదర్శి నక్కి శ్రీకాంత, సీఐటీయూ నాయకులు మాణిక్యంశెట్టి, శివరాం, నాగమద్దయ్య, డిమాండ్‌ చేశారు. బుధవారం పట్టణంలోని పాతబస్టాండు వద్ద కేంద్రం తీసుకువ చ్చిన (జీరామ్‌జీ) జీవో ప్రతులను సీపీఎం, సీఐటీయూ నాయకులు భోగి మంటల్లో వేసి దహనం చేశారు. కార్యక్రమంలో రైతులు కుల్లాయప్ప, నాగేశ్వరరావు పాల్గొన్నారు.

బేతంచెర్ల: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్‌ కోడ్‌లను, జాతీయ ఉపాధి హమీ చట్టాన్ని నిర్వీర్యం చేసి గాంధీ పేరు తొలగించి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన విజిబీ రాంజీ చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు వై ఎల్లయ్య, సీపీఎం మండల కార్యదర్వి ఎం. మధుశేఖర్‌ డిమాండ్‌ చేశారు. జీవో పత్రాలను బేతంచెర్ల పాత బస్టాండ్‌ భారత బేకరీ సర్కిల్‌లో సీఐటీయూ ఉపాఽధ్యక్షుడు బి రామాంజనేయులు ఆధ్వర్యంలో భోగి మంటల్లో వేసి దహనం చేశారు. కార్యక్రమంలో ఎస్‌కె బాషా, డి రాజు, రామకృష్ణ, రషీద్‌, టింగు, చిన్న వెంకటేష్‌, రాజు, సంజీవ రాయుడు, సుబ్బరాయుడు, పరశురాముడు పాల్గొన్నారు.

Updated Date - Jan 14 , 2026 | 11:19 PM