పీఈటీల కృషి అభినందనీయం
ABN , Publish Date - May 23 , 2026 | 12:10 AM
క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు వ్యాయామ ఉపాధ్యాయులు(పీఈటీ) నిర్విరామంగా కృషి చేస్తు న్నారని, అభినందనీయమని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు అన్నారు.
డీఎస్‌డీవో భూపతిరావు
డ్రాగన బోట్ ఎంపిక పోటీలు ప్రారంభం
కర్నూలు స్పోర్ట్స్, మే 22 (ఆంధ్రజ్యోతి): క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు వ్యాయామ ఉపాధ్యాయులు(పీఈటీ) నిర్విరామంగా కృషి చేస్తు న్నారని, అభినందనీయమని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు అన్నారు. శుక్రవారం జిల్లా డ్రాగన బోట్ అసోసి యేషన ఆధ్వర్యంలో గార్గేయపురం చెరువులో నిర్వహించిన జిల్లా స్థాయి డ్రాగన బోట్ ఎంపిక పోటీలను ఆయన రాష్ట్ర డ్రాగన బోట్ సంఘం కార్యదర్శి అవినాష్‌శెట్టితో కలిసి ప్రారంభించారు. భూపతిరావు మాట్లాడు తూ గ్రామీణ ప్రాంతాల్లోనూ క్రీడలపై ఆసక్తి పెరుగుతుండటం సంతోషక రమన్నారు. జిల్లా స్థాయి నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపేందుకు ఇటువంటి పోటీలు ఎంతో ఉప యోగపడుతాయన్నారు. క్రీడాకారులతో కలిసి అతిథులు డ్రాగన బోట్‌ను నడిపి ఉత్సాహాన్ని నింపారు. క్రీడా సంఘాల ప్రతినిధులు లోకేశ, గంగాధర్, వ్యాయామ ఉపాధ్యాయులు దాసు, ప్రకాష్ పాల్గొన్నారు.