Share News

మోదీ కోసం ఈసీ పని చేస్తోంది

ABN , Publish Date - Oct 09 , 2026 | 12:49 AM

ప్రజాస్వా మ్యానికి కాపు కాయాల్సిన ఈసీ.. మోదీకి కాపు కాస్తోందని, ఆయన కోసం పని చేస్తోందని ఏఐసీసీ సభ్యుడు, కాంగ్రెస్‌ జిల్లా ఇనచార్జి జం గిటి లక్ష్మీనరసింహ యాదవ్‌ అన్నారు.

 మోదీ కోసం ఈసీ పని చేస్తోంది
నిరసన తెలుపుతున్న కాంగ్రెస్‌ నాయకులు

ఓట్ల తొలగింపు, ‘సర్‌’ అక్రమాలపై సమాధానం చెప్పాలి

రాహుల్‌, ప్రియాంక అరెస్టులకు నిరసనగా ఆందోళన

కర్నూలు అర్బన్‌ / కల్లూరు, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): ప్రజాస్వా మ్యానికి కాపు కాయాల్సిన ఈసీ.. మోదీకి కాపు కాస్తోందని, ఆయన కోసం పని చేస్తోందని ఏఐసీసీ సభ్యుడు, కాంగ్రెస్‌ జిల్లా ఇనచార్జి జం గిటి లక్ష్మీనరసింహ యాదవ్‌ అన్నారు. గురువారం రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టులను నిరసిస్తూ, ఓట్ల తొలగింపు, ఎస్‌ఐఆర్‌ అక్రమాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వ హించారు. నంద్యాల చెక్‌ పోస్టు సమీపంలోని దామోదరం సంజీ వయ్య భవన నుంచి కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టి కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నినా దాలు చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఓటు హక్కు కోసం ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడం అప్రజాసామిక మన్నారు. కార్యక్రమంలో నంద్యాల డీసీసీ అధ్యక్షుడు గార్ల పాటి మద్దిలేటి, కాంగ్రెస్‌ నాయకులు అనంతరత్నం మాదిగ, మహేంద్ర నాయుడు, షేక్‌ ఖాజాహుస్సేన పాల్గొన్నారు.

Updated Date - Oct 09 , 2026 | 12:49 AM