పేదలకు సొంతింటి కల సాకారం
ABN , Publish Date - Mar 30 , 2026 | 11:34 PM
పేదవాడి సొం తింటి కల నేడు నెరవేరింది. నంద్యాల నియోజకవర్గ పరిధిలోని రైతున గర్ శిల్పానగర్‌లో నిర్మించిన గృహాన్ని సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
నంద్యాల నియోజకవర్గంలో ఘనంగా గృహ ప్రవేశాల ఉత్సవం
లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేసిన
మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్
నంద్యాల కల్చరల్, మార్చి 30 (ఆంధ్రజ్యోతి) : పేదవాడి సొం తింటి కల నేడు నెరవేరింది. నంద్యాల నియోజకవర్గ పరిధిలోని రైతున గర్ శిల్పానగర్‌లో నిర్మించిన గృహాన్ని సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 2,50,893 లక్షల ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నం ద్యాలలో ఇళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధి దారుల కుటుంబాలతో మంత్రి ఫరూక్ కలిసి గృహ ప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పేదవాడి సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయ మని, అర్హులైన ప్రతి ఒక్కరికీ గృహ సౌకర్యం కల్పిం చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదా రులు నంద్యాల సుశీల, నంద్యాల మార్కెట్ యార్డు చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న,హౌసింగ్ డిఈ విజయ్ బాబు, ఎఈ విష్ణువర్దన్‌రెడ్డి, వర్క్ ఇన్‌స్పెక్టర్లు సికిందర్, జయంత్ పాల్గొన్నారు.