Share News

స్వప్నం చెదిరింది

ABN , Publish Date - Oct 16 , 2026 | 11:44 PM

ఆదోని మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా జనసేనకు అవకాశం వస్తుందని భావించిన ఆపార్టీ ఇన్‌చార్జి భంగపడ్డారు. ‘కూటమి’ ధర్మం తప్పిందని మల్లప్ప ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.

స్వప్నం చెదిరింది
నామినేషన్‌ దాఖలు చేస్తున్న జనసేన ఆదోని నియోజకవర్గ ఇన్‌చార్జి మల్లప్ప భార్య స్వప్న

జనసేన రెబల్‌గా ఇన్‌చార్జి భార్య స్వప్న నాయకర్‌ నామినేషన్‌

‘కూటమి’ ధర్మంతో మోసపోయామంటున్న మల్లప్ప

ఆదోని, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): ఆదోని మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా జనసేనకు అవకాశం వస్తుందని భావించిన ఆపార్టీ ఇన్‌చార్జి భంగపడ్డారు. ‘కూటమి’ ధర్మం తప్పిందని మల్లప్ప ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. దీంతో జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి మల్లప్ప తన భార్య స్వప్న నాయకర్‌తో శుక్రవారం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్థానానికి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేయిం చారు. స్థానిక రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించింది. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పీఠాన్ని జనసేనకు కేటాయిస్తామని కూటమి పెద్దలు తొలు త హామీ ఇచ్చారని మల్లప్ప వర్గీయులు బలంగా చెబుతున్నారు. దానికి తగినట్లుగానే జనసేన కేడర్‌ క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేసుకుంది. చివరి నిమిషంలో సమీకరణల తెర వెనుక జరిగిన పరిణామాలతో ఆ సీటు ను టీడీపీకి కట్టబెట్టారు. ఇటు కూటమిలో కొనసాగుతూనే అటు సొంత పార్టీ అభ్యర్థికి (కూటమి కేటాయించిన సీటుకు) వ్యతిరేకంగా బరిలో నిలవడం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఒకే పార్టీలో నియోజకవర్గ ఇన్‌చార్జి హోదాలో ఉన్న వ్యక్తి కుటుంబ సభ్యురాలే రెబల్‌గా నామినేషన్‌ వేయడం అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. నామి నేషన్ల పర్వం రంజుగా మారిన తరుణంలో ఈరెబల్‌ వివాదంపై కూ టమి హైకమాండ్‌ ఏవిధంగా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు లోపు ఇరు పార్టీల పెద్దలు రంగంలోకి దిగి మల్లప్పతో చర్చలు జరిపి బుజ్జగిస్తారా? లేక ఈ ’స్వప్న’ యాత్ర ఆదోని కూటమికి నిజంగానే పీడకలగా మారుతుందా? వేచి చూడాల్సిందే.

Updated Date - Oct 16 , 2026 | 11:44 PM