వసతి గృహాలను పరిశుభ్రంగా ఉంచాలి
ABN , Publish Date - Jan 18 , 2026 | 12:10 AM
జిల్లాలోని వసతి గృహాలను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని డీబీసీడబ్ల్యూవో ప్రసూన సిబ్బందికి సూచించారు.
డీబీసీడబ్ల్యూవో ప్రసూన
కర్నూలు ఎడ్యుకేషన్, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని వసతి గృహాలను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని డీబీసీడబ్ల్యూవో ప్రసూన సిబ్బందికి సూచించారు. నగరంలోని బీసీ బాలుర వసతి గృహంలో శని వారం నాలుగో తరగతి ఉద్యోగులకు పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ హాస్టల్ ప్రాంగణం, వంటశాలలను, స్టోర్ గదులను, లివింగ్ రూములను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ముఖ్యంగా మరుగుదొడ్లు, స్నానపు గదులను నిత్యం పరిశుభ్రంగా ఉంచాల న్నారు. రుచికరమైన, శుచికరమైన వంటలను తయారు చేయాలని సూచిం చారు. ఆహార నిర్వహణ పద్ధతులపై సిబ్బందికి అవగాహన కల్పిం చారు. హాస్టల్ నిర్వహణ, విద్యార్థులతో ఎలా వ్యవహరించాలో సూచించారు. హాస్టల్‌లోని విద్యార్థులు ఉద్యోగులు స్నేహపూర్వకంగా ఉండేలా మలుచుకు న్నప్పుడే వారి సమస్యలను మీ దృష్టికి తీసుకురాగలరని ఆమె చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీబీసీడబ్ల్యూవో హెచ్చరించారు. కార్యక్రమంలో సహాయ సంక్షేమ శాఖ అధికారులు శ్రీనివాసులు, అంజనే యులు, హాస్టల్ వార్డెన్లు పాల్గొన్నారు.