స్వర్ణరథంపై ఆది దంపతులు
ABN , Publish Date - Jul 13 , 2026 | 11:43 PM
శ్రీశైల క్షేత్రంలో ఆరుద్ర నక్షత్ర పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిపించారు. సోమవారం తెల్లవారుజామున మల్లికార్జున స్వామికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకంతోపాటు విశేష పూజలు జరిపించినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు.
వర్షాలు కురవాలని శ్రీశైలంలో ప్రత్యేక పూజలు
శ్రీశైలం, జులై 13 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల క్షేత్రంలో ఆరుద్ర నక్షత్ర పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిపించారు. సోమవారం తెల్లవారుజామున మల్లికార్జున స్వామికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకంతోపాటు విశేష పూజలు జరిపించినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. అనంతరం గంగాధర మండపం వద్దకు పల్లకిలో వచ్చిన ఆదిదంపతులకు శాస్త్రోక్త పూజలు నిర్వహించి స్వర్ణ రథంపై ఆశీనుల చేశారు. గంగాధర మండపం నుంచి నంది ఆలయం వరకు జరిగిన రథోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. రథోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ఆంజనేయులు, ధర్మకర్తల మండలి చైర్మెన్ పోతుగుంట రమేష్‌నాయుడు, సభ్యులు రమణ, ఆల అనీల్, పీఆర్‌వో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
శ్రీశైలంలో ప్రత్యేక పూజలు
శ్రీశైల మహా క్షేత్రంలో సోమవార ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. పురాతన వైభవం కలిగిన పంచమఠాలలో కొలువై ఉన్న శివలింగాలకు వేదపండితులు ఆగమశాస్త్రం ప్రకా రం పంచామృతాభిషేకాలు జరిపించారు. సాయంత్రం ఆలయ ప్రాకారంలో ఉన్న పురాతన రాతి మండపంలో ప్రత్యేక పుష్పా లతో అలంకరించిన ఊయలలో స్వామిఅమ్మవార్లకు షోడశో పచార పూజాక్రతువులు నిర్వహించి 1008 దీపాలు వెలిగించారు. వెండి రథంపై ఆశీనులైన స్వామి, అమ్మవార్లకు షోడశోపచార పూజా క్రతువులు నిర్వహించారు.