Share News

వెండి రథంపై ఆది దంపతులు

ABN , Publish Date - Nov 02 , 2026 | 11:13 PM

శ్రీశైలంలో స్వామి, అమ్మవార్లకు సోమవారం వెండి రథోత్సవాన్ని వైభవంగా జరిపించారు.

వెండి రథంపై ఆది దంపతులు
వెండి రథం ప్రారంభిస్తున్న అధికారులు, అర్చక వేదపండితులు

శ్రీశైలం, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): శ్రీశైలంలో స్వామి, అమ్మవార్లకు సోమవారం వెండి రథోత్సవాన్ని వైభవంగా జరిపించారు. సాయంత్రం ప్రదోషకాల ఘడియల్లో మహామంగళహారతులు, సహస్ర దీపాలంకరణ సేవ తరువాత స్వామి, అమ్మవార్లను వెండిరథంపై ఆశీనులు చేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చక వేదపండితుల ఆలయ అధికారులు సిబ్బంది మల్లికా గుండం నుంచి వెండి రథాన్ని శివనామస్మరణ చేస్తూ ఆలయ ప్రదక్షిణ చేశారు. రథోత్సవంలో పర్యవేక్షకుడు గిరిప్రసాద్‌, సీఎ్‌సవో శ్రీనివాసరావు, ముఖ్య అర్చకుడు హరిస్వామి, గంగయ్యతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - Nov 02 , 2026 | 11:13 PM