Share News

రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధిని తెలియజేయాలి

ABN , Publish Date - Jul 27 , 2026 | 12:04 AM

knl nesws

రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధిని తెలియజేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గిత్త జయసూర్య

నేటి నుంచి ఇంటింటి ప్రచారం

నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య

నందికొట్కూరు, జూలై 26 (ఆంధ్రజ్యోతి) : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికీ తిరిగి ప్రతి ఒక్కరికీ వివరించాలని ఎమ్మెల్యే గిత్త జయసూర్య టీడీపీ మండల కన్వీనర్లుకు సూచించారు. ఆదివారం పట్టణంలోని మార్కెట్‌ యార్డులో మండలాలు, క్లస్టర్‌, యూనిట్‌, బూత్‌ ఇన్‌చార్జిలతో సమీక్షా సమావేశం నిర్వహించి దిశానిర్ధేశం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన రెండేళ్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఈనెల 27వ తేదీ నుంచి ప్రతి ఇంటికి చేరవేసే విధంగా డోర్‌-టు-డోర్‌ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వివరిం చారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధిని కార్యకర్తలు సమగ్రంగా వివరించాలని సూచించారు. సమావేశంలో నందికొట్కూరు మండల కన్వీనర్‌ మాండ్ర సురేంద్రనాథ్‌రెడ్డి, నందికొట్కూరు మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ వీరం ప్రసాద్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, ఖాతా రమేష్‌రెడ్డి, పలుచాని మహేశ్వరరెడ్డి, గుండ్రెడ్డి మోహన్‌రెడ్డి, లింగస్వామిగౌడ్‌, శివరాంరెడ్డి, లాయర్‌ జాకిర్‌ హుస్సేన్‌, గిరీశ్వర్‌రెడ్డి, వాసురెడ్డి, ఉదయ్‌ కిరణ్‌రెడ్డి, నారపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ల

Updated Date - Jul 27 , 2026 | 12:05 AM