తప్పిన దళారుల బెడద
ABN , Publish Date - Jan 14 , 2026 | 12:31 AM
ఉమ్మడి జిల్లాలోని కంది రైతులకు దళారుల బెడద తప్పిపోయింది. సీఎం చంద్రబాబుతో పాటు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కంది రైతులకు కేంద్రం ప్రకటించిన క్వింటానికి రూ.8వేలు అందించడంతో పాటు దళారులు రైతుల దరిదాపుల్లోకి రాకుండా వెంటనే కేంద్ర సంస్థలు జాతీయ సహకార కన్జ్యూమర్ ఫెడరేషన్ ఎన్‌సీసీఎ్‌ఫ, అదే విదంగా నాఫెడ్ సంస్థలను రంగంలోకి దించి కంది రైతులను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తి ఫలించింది.
మద్దతు ధరకు కందుల కొనుగోలు
క్వింటం రూ.8వేలు..
కర్నూలు అగ్రికల్చర్, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలోని కంది రైతులకు దళారుల బెడద తప్పిపోయింది. సీఎం చంద్రబాబుతో పాటు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కంది రైతులకు కేంద్రం ప్రకటించిన క్వింటానికి రూ.8వేలు అందించడంతో పాటు దళారులు రైతుల దరిదాపుల్లోకి రాకుండా వెంటనే కేంద్ర సంస్థలు జాతీయ సహకార కన్జ్యూమర్ ఫెడరేషన్ ఎన్‌సీసీఎ్‌ఫ, అదే విదంగా నాఫెడ్ సంస్థలను రంగంలోకి దించి కంది రైతులను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తి ఫలించింది. జాతీయ సహకార కన్జ్యూమర్ ఫెడరేషన్ సంస్థ ఉమ్మడి జిల్లాలో 40వేల మెట్రిక్ టన్నుల కందులను కొనుగోలు చేసేందుకు మార్క్‌ఫెడ్ సంస్థను నోడల్ ఏజెన్సీగా గుర్తించి బాధ్యతను అప్పగించింది. నాఫెడ్ ద్వారా 10వేల నుంచి 20వేల మెట్రిక్ టన్నుల కందులను కొనుగోలు చేసేందుకు కర్నూలు జిల్లాలోని 7మార్కెట్ కమిటీలలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెండు జిల్లాలో డీసీఎంఎస్ ద్వారా కొనుగోలు కేంద్రాలను నిర్వహించేందుకు ఆ సంస్థ చైర్మన్ వై.నాగేశ్వరరావు యాదవ్ ప్రత్యేక దృష్టి సారించారు. కర్నూలు, ఆలూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ, మంత్రాలయం, ఆదోని మార్కెట్ యార్డుల్లో నాఫెడ్ సంస్థ డీసీఎంఎస్ ద్వారా కొనుగోలు కేంద్రాలను కంది రైతులకు అందుబాటులోకి తెచ్చారు. నిన్నటి దాకా వ్యాపారులు, దళారులు మార్కెట్ యార్డులో చెప్పిందే వేదంగా జరిగింది. ఇకపై అటువంటి పరిస్థితికి తావు లేకుండా డీసీఎంఎస్ కేంద్రాలు పని చేయనున్నాయి.
మద్దతు ధర అందిస్తున్నాం
ఉమ్మడి జిల్లాలో కంది రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటానికి రూ.8వేలు రైతులకు అందించేందుకు డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తెచ్చాం. తమ సిబ్బంది పూర్తిస్థాయిలో రైతులకు అవగాహన కల్పించి కొనుగోలు కేంద్రాలకే కందులు తెచ్చేలా చర్యలు చేపట్టారు. గ్రామాల్లో వ్యాపారులు, దళారుల మాటలను నమ్మి నష్టపోకూడదు. - వై.నాగేశ్వరరావు యాదవ్, డీసీఎంఎస్ చైర్మన్