Share News

‘వెలిగొండ’ను పూర్తి చేసిన ఘనత చంద్రబాబుదే

ABN , Publish Date - Aug 31 , 2026 | 11:30 PM

వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుదే అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌, న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు.

‘వెలిగొండ’ను పూర్తి చేసిన ఘనత చంద్రబాబుదే
మాట్లాడుతున్న మంత్రులు

మంత్రులు కందుల దుర్గేశ్‌, ఎన్‌ఎండీ ఫరూక్‌

నంద్యాల రూరల్‌, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుదే అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌, న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు. సోమవారం టీడీపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి రామచంద్రరావు నివాసంలో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడారు. వైసీపీ ప్రాజెక్టులపై తప్పు డు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. 1996 చంద్రబాబు నాయుడు వెలి గొండ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసి మూడు దశాబ్దాల అనంతరం మళ్లీ ఆయన ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేసి ప్రారంభోత్సవం చేయడం చరిత్రలో అరుదైన విషయమని కొనియాడారు. కంభం చెరువు, బైరవకోన, నల్లమల అడవులను కలుపుతూ ప్రత్యేక టూరిజం సర్య్కూట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని తామే చేశానని వైసీపీ నాయకులు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. కార్యక్రమంలో బీజేజీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 31 , 2026 | 11:30 PM