Share News

రైతుతోనే దేశ ప్రగతి

ABN , Publish Date - Mar 13 , 2026 | 11:28 PM

రైతుతోనే దేశ ప్రగతి అని న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు.

రైతుతోనే దేశ ప్రగతి
చెక్కును పంపిణీ చేస్తున్న మంత్రి ఫరూక్‌

న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌

‘అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్‌’ చెక్కుల పంపిణీ

నంద్యాల రూరల్‌, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): రైతుతోనే దేశ ప్రగతి అని న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని బిల్లలాపురం గ్రామంలో జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మూడో విడత అన్నధాత సుఖీభవ, పీఎం కిసాన్‌ చెక్కుల పంపిణీ నిర్వహించారు. కలెక్టర్‌ రాజకుమారితో కలిసి వివిధ స్టాళ్లను పరిశీలించారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో మంత్రి మాట్లాడారు. రైతన్న బాగుండాలని పీఎం నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు కలిసికట్టుగా నిధులను విడుదల చేస్తున్నారు. అన్నదాత సుఖీభవ కింద జిల్లాలో మూడవ విడత ద్వారా 2,06,052మంది రైతులు, పీఎం కిసాన్‌ కింద 1,87,450 మంది మొత్తం 400,02కోట్లు లబ్ది పొందుతున్నట్లు పేర్కొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి పథకం అర్హులకు అందించడంలో జిల్లా యం త్రాంగం కృషిచేస్తుందన్నారు. నంద్యాల మార్కెట్‌ యార్డు చైర్మన్‌ గుంటు పల్లి హరిబాబు, మార్క్‌ఫెడ్‌ జిల్లా అధికారి హరినాధరెడ్డి, తహసీల్దార్‌ శ్రీనివాసులు, ఎంపీడీవో సుగుణశ్రీ, మండల వ్యవసాయాధికారి ప్రసాధరావ్‌, టీడీపీ ఇన్‌చార్జి చిలకల చెన్నయ్య. నంద్యాల, గోస్పాడు మండలాల టీడీపీ కన్వీనర్లు విశ్వనాధరెడ్డి, తులసీశ్వరరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Mar 13 , 2026 | 11:28 PM