Share News

నంద్యాల సమగ్రాభివృద్ధే ధ్యేయం

ABN , Publish Date - Oct 01 , 2026 | 11:35 PM

నంద్యాల సమగ్రాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖల మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు.

నంద్యాల సమగ్రాభివృద్ధే ధ్యేయం
పింఛన్‌ పంపణీ చేస్తున్న మంత్రి, కలెక్టర్‌

రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖల మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌

విద్య, యువతకు ఉపాధి ప్రాధాన్యం: కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల రూరల్‌, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): నంద్యాల సమగ్రాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖల మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు. గురువారం మండలంలోని పోలూరులో నిర్వహించిన పేదల సేవలో 2.0 కార్యక్రమంలో కలెక్టర్‌ రాజకుమారితో కలిసి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టులు, పట్టణ విస్తరణలో నంద్యాల ప్రాంతం క్రమంగా అభివృద్ది చెందుతుందన్నారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా నంద్యాలలో రహదారులు, డ్రైనేజీతో పాటు ఇతర మౌలిక వసతులను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కలెక్టర్‌ రాజకుమారి మాట్లాడుతూ గ్రామాల అవసరాలను గుర్తించి మౌలిక వసతులు, అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపుతున్నామన్నారు. విద్య, రైతు సంక్షేమం, యువతకు ఉపాధికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. పోలూరులో భూ రీసర్వే పూరైందని పట్టాదారు పాస్‌ పుస్తకాలను పంపిణీ చేస్తున్నామన్నారు.

లబ్ధిదారుల కళ్లలో ఆనందం

పింఛన్‌ అందుకున్న లబ్ధిదారుల కళ్లలో ఆనందం వెల్లివిరుస్తోందని మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు. పోలూరు గ్రామంలో నిర్వహించిన పింఛన్ల పంపిణీలో కలెక్టర్‌ రాజకుమారితో కలిసి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రతినెల నిర్ణీత సమయంలో పింఛన్ల పంపిణీకి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 2.09లక్షల మందికి సుమారు రూ.92 కోట్లు పింఛన్లు పంపిణీ చేశామన్నారు. నంద్యాల మార్కెట్‌ యార్డు చైర్మన్‌ గుంటుపల్లి హరిబాబు, నంద్యాల రూరల్‌ తహసీల్దార్‌ శ్రీవాణి, ఎంపీడీవో సుగుణశ్రీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 01 , 2026 | 11:35 PM