సీఎం పర్యటనను విజయవంతం చేయాలి
ABN , Publish Date - Jul 17 , 2026 | 11:22 PM
సీఎం పర్యటనను విజయ వంతం చేయాలని కలెక్టర్ సిరి అధికారులకు సూచిం చారు. ఆస్పరి పీహెచ్‌సీలో సంజీవని ప్రాజెక్టును ఈనెల 25న ముఖ్యమంత్రి చంద్ర బాబు ప్రారంభిస్తుండడంతో శుక్రవారం కలెక్టర్ సిరి, టీడీపీ జిల్లా అధ్యక్షు రాలు గుడిసె కృష్ణమ్మ, టీడీపీ ఆలూరు ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతితో కలిసి ఏర్పాట్లను, స్థలాలను పరిశీలించారు.
ఆస్పరిలో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ సిరి
ఆస్పరి, జూలై 17 (ఆంధ్రజ్యోతి): సీఎం పర్యటనను విజయ వంతం చేయాలని కలెక్టర్ సిరి అధికారులకు సూచిం చారు. ఆస్పరి పీహెచ్‌సీలో సంజీవని ప్రాజెక్టును ఈనెల 25న ముఖ్యమంత్రి చంద్ర బాబు ప్రారంభిస్తుండడంతో శుక్రవారం కలెక్టర్ సిరి, టీడీపీ జిల్లా అధ్యక్షు రాలు గుడిసె కృష్ణమ్మ, టీడీపీ ఆలూరు ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతితో కలిసి ఏర్పాట్లను, స్థలాలను పరిశీలించారు. ఆస్పరి సమీపంలో ఆలూరు రోడ్డు వైపు ఏరియాలను, మ్యాపును పరిశీలించారు. సుమారు 30 ఎకరాల దాకా సీఎం హెలికాఫ్టర్ ల్యాండింగ్, సభకు అవసరమవుతుందని గుర్తిం చారు. ఆదోని రోడ్డు వైపు జడ్పీ పాఠశాల ఆవరణలో కూడా స్థలాన్ని పరిశీలించారు. పీహెచ్‌సీకి చేరుకునే మార్గాన్ని, ఆసు పత్రిలోని సౌకర్యాలను, మందుల పంపిణీ కేంద్రాన్ని, కు.ని. ఆపరే షన్ థియేటర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా సంజీవని పైలట్ ప్రాజెక్టు ట్రైనర్ సిబ్బం దితో మాట్లాడారు. ప్రోగ్రాం విజయ వంతం కోసం ఏఏ మేరకు సౌకర్యాలు అవసరమో తెలుసుకు న్నారు. ఆస్పరి పీహెచ్‌సీ ఎంపిక ప్రాధాన్యతను కూడా అడిగి తెలుసుకున్నారు. కు.ని.ఆపరేషన్లలో రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఆసుపత్రి స్థానాన్ని అడిగి తెలుసుకున్నారు. సంజీవని ప్రాజెక్టు ప్రారంభోత్సవం కోసం తీసుకోవాల్సిన అంశాలను కూడా తెలుసు కున్నారు. కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ తాము పరిశీలించిన అంశాలను స్థలాలను ప్రభుత్వానికి నివేదిస్తామ న్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి వైకుంఠం శివప్రసాద్, జేసీ నూరుల్ ఖమర్, ఆర్డీవో ఓబులేష్, పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య, సీఐ శ్రీనివాస్‌నాయక్, తహసీల్దార్ మల్లికార్జున్‌రెడ్డి, ఎంపీడీవో గీతావాణి, వైద్యాధికారి రఘురామ్ రెడ్డి, బాలకృష్ణ, దుర్గాభాయి, మార్కెట్‌యార్డు చైర్మన్ వెంకటేష్, టీడీపీ నాయకులు కృష్ణయాదవ్, మండల కన్వీనర్ గోవిందు, ఎంపీటీసీ నరసప్ప, ముత్యాలరెడ్డి, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు అరవింద్‌కుమార్, రంగనాథ్, బినిగేర వెంకటేష్, రాఘవేంద్ర, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.