Share News

ఎన్నికల ప్రధాన అధికారిని తొలగించాలి

ABN , Publish Date - Sep 26 , 2026 | 11:57 PM

ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్వర్‌ కుమార్‌ను తొలగించాలని వామపక్ష నాయకులు డిమాండ్‌ చేశారు.

ఎన్నికల ప్రధాన అధికారిని తొలగించాలి
సమావేశంలో మాట్లాడుతున్న వామపక్షాల నాయకులు

వామపక్షాల డిమాండ్‌

కర్నూలు న్యూసిటీ, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్వర్‌ కుమార్‌ను తొలగించాలని వామపక్ష నాయకులు డిమాండ్‌ చేశారు. సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ, సీపీఐఎంల్‌ మాస్‌లైన్‌, ఎస్‌యూసీఐ అధ్వర్యంలో శనివారం సీపీఐ కార్యాలయంలో నగర కార్యదర్శి పి. రామక్రిష్ణారెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి బి. గిడ్డయ్య మాట్లాడుతూ దేశంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో అనేక అవకతవకలు జరిగాయని అర్హులైన ఓటర్లను తొలగించాలని తోటి కమిషనర్లు ఎన్నికల ప్రధాన అధికారి దృష్టికి తీసుకెళ్లారని అన్నారు. తోటి కమిషనర్ల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఆర్‌ఎ్‌సఎస్‌ తొత్తుగా వ్యవహరిస్తున్న జ్ఞానేశ్‌కుమార్‌ను తక్షణమే తొలగించాలని డిమాండ్‌ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి డి. గౌస్‌దేశాయ్‌ మాట్లాడుతూ ఈ సమస్య మీద ఈ నెల 28న జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని, అక్టోబర్‌ 2న గాంధీ విగ్రహల ముందు వామపక్ష పార్టీ అధ్వర్యంలో నిరసనలు వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వామపక్ష పార్టీ నాయకులు వెంకటస్వామి, తిరుపాలు, వెంకటేష్‌, నాగన్న, మునెప్ప, పీఎస్‌. రాధాక్రిష్ణ, రాముడు, అన్వర్‌, భద్రకుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 26 , 2026 | 11:57 PM