ముగిసిన ఉత్సవ పల్లకి పర్యటన
ABN , Publish Date - Jan 27 , 2026 | 12:30 AM
మండలంలో నరసింహస్వామి ఉత్సవ పల్లకి పర్యటన సోమవారం రాత్రి ముగిసింది.
రుద్రవరం, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): మండలంలో నరసింహస్వామి ఉత్సవ పల్లకి పర్యటన సోమవారం రాత్రి ముగిసింది. నల్లవా గుపల్లె గ్రామంలో పార్వేట పల్లకిలో కొలువు దీరిన ఉత్సవమూర్తులు ప్రహ్లాద వరదస్వామి, జ్వాలా నరసింహస్వామిలకు పూజలు చేశారు. ఆళ్లగడ్డ మండలం బాల్చాపురం మిట్టకు ఉత్సవ పల్లకి సోమవారం రాత్రి చేరుకుంది.