కూలీల హక్కులను కాలరాస్తున్న కేంద్రం
ABN , Publish Date - Jan 10 , 2026 | 11:59 PM
ఉపాధి హామీ కూలీల హక్కులను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టం కాలరాస్తోందని మాజీ ఐఏఎస్ అధికారి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత ఆహ్వానితుడు, ఏఐసీసీ జార్ఖండ్ ఇన్‌చార్జి కొప్పుల రాజు అన్నారు.
మాజీ ఐఏఎస్ అధికారి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత ఆహ్వానితుడు రాజు
కర్నూలు అర్బన్, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ కూలీల హక్కులను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టం కాలరాస్తోందని మాజీ ఐఏఎస్ అధికారి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత ఆహ్వానితుడు, ఏఐసీసీ జార్ఖండ్ ఇన్‌చార్జి కొప్పుల రాజు అన్నారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో డీసీసీ ప్రెసిడెంట్ క్రాంతి నాయుడుతో కలిసి సమావేశం నిర్వహిం చారు. సోనియా గాంధీ నాయకత్వంలో నాటి ప్రధాని మన్మోహన్, మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పథకాన్ని అమలు చేస్తే బీజేపీ ప్రభుత్వం రద్దు చేయడం వ్యవసాయ కూలీల హక్కులను కాలరాయడ మేనని ఆరోపించారు. తాను గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న సమయంలో దేశంలోనే ఒక ఆదర్శవ ంతమైన పథకం అమలు చేసే అవకాశం దక్కిందన్నారు. ఈ కొత్త చట్టం ద్వారా కూలీలు వంచనకు గురవుతున్నారని ఆరోపించారు. మహాత్మా గాంధీ ఉపాధి జాతీయ ఉపాధి హమీ పథకానికి ఏపీకి సంబంధం ఉందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్తచట్టంపై ప్రజలకు వివరిస్తూ ఉద్యమాలకు సిద్దమౌతున్నామన్నారు. అన్ని గ్రామాల్లో ఉపాధి హమీ కూలీలతో కూర్చుని మాట్లాడి వారి యొక్క ఆవేదనను ఆర్థం చేసుకుని ఆందోళన చేయనున్నట్లు రాజు తెలిపారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అఽధ్యక్షుడు మహేంద్రనాయుడు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ జిలానీ బాషా, మాజీ మంత్రి మూలింటి మారెప్ప, ఐఎన్ టీయూసీ జిల్లా అధ్యక్షుడు బి, బ్రతుకన్న, అనంతర్నం మాదిగ, బజారన్న, వై, మారుతి రావు, సూర్యప్రకాష్‌రెడ్డి, దామోదర రాధక్రిష్ణ పాల్గొన్నారు.