జనగణనను సమర్థవంతంగా పూర్తి చేయాలి
ABN , Publish Date - Nov 13 , 2026 | 12:11 AM
జనగణన-2027లో భాగంగా రెండో దశలో నిర్వహించ నున్న జనాభా గణన(పాపులేషన ఎన్ముమ రేషన) ప్రక్రియను కర్నూలులో సమర్థవంతంగా పూర్తి చేయా లని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు ఆదేశించారు.
నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు
కర్నూలు న్యూసిటీ, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): జనగణన-2027లో భాగంగా రెండో దశలో నిర్వహించ నున్న జనాభా గణన(పాపులేషన ఎన్ముమ రేషన) ప్రక్రియను కర్నూలులో సమర్థవంతంగా పూర్తి చేయా లని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు ఆదేశించారు. గురువారం స్థానిక ఎస్‌బీఐ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో మాస్టర్ ట్రైనర్లకు నిర్వహించే శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. కమిషనర్ మాట్లాడుతూ జనవరి 10 నుంచి 24వ తేదీ వరకు స్వీయ గణన ప్రక్రియకు అవకాశం ఉంటుంద న్నా రు. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఇంటింటి జనాభా గణనను నిర్వహి స్తామన్నారు. ప్రస్తుతం శిక్షణ పొందుతున్న 22 మంది మాస్టర్ ట్రైనర్లు, తదు పరి సూపర్‌వైజర్లు, ఎన్యూమరేటర్లకు డిసెంబరు రెండో వారంలో శిక్షణ అందిం చనున్నట్లు ఆయన వివరించారు. జనగణనలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ప్రతి అంశంపై పూర్తి అవగాహనతో శిక్షణ పొందాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్‌రెడ్డి, సెన్సస్ ఇనచార్జి ఇజ్రాయేలు తదితరులు పాల్గొన్నారు.