సీఈసీని తొలగించాలి
ABN , Publish Date - Oct 03 , 2026 | 12:07 AM
చీఫ్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ కుమార్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని నేషనల్ లాయర్స్ ఫోరమ్ ఫర్ సోషల్ జస్టిస్ వై.జయరాజు డిమాండ్ చేశారు.
కర్నూలు లీగల్, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): చీఫ్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ కుమార్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని నేషనల్ లాయర్స్ ఫోరమ్ ఫర్ సోషల్ జస్టిస్ వై.జయరాజు డిమాండ్ చేశారు. గాంధీ జయంతి సందర్భంగా స్థానిక పాతబస్టాం డులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జ్ఞానేష్ కుమార్‌ను తొలగించే వరకు సర్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను ఆపివేయాలని, భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలను పాత ఓటర్ల జాబితా ప్రాతిపదికగానే నిర్వహించాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులు మాసిపోగు సుబ్బయ్య, కే.మాదన్న, నిత్య జీవరాజు, నాగేంద్రనాథ్ యాదవ్, రాజేష్, సుమనారాణి పాల్గొన్నారు.