Share News

పేదలకు వరం అన్న క్యాంటీన్‌

ABN , Publish Date - May 22 , 2026 | 11:26 PM

పేదల పాలిట వర్గం అన్న క్యాంటీన్‌ అని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ గుప్తా అన్నారు.

పేదలకు వరం అన్న క్యాంటీన్‌
అన్న క్యాంటీన్‌లో భోజనం చేస్తున్న రోగులతో మాట్లాడుతున్న మంత్రి టీజీ భరత్‌ గుప్తా

మంత్రి టీజీ భరత్‌ గుప్తా

కర్నూలు హాస్పిటల్‌, మే 22 (ఆంధ్రజ్యోతి): పేదల పాలిట వర్గం అన్న క్యాంటీన్‌ అని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ గుప్తా అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌ వద్దనున్న అన్న క్యాంటీన్‌ను మంత్రి తనిఖీ చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చి భోజనం చేస్తున్న వృద్ధులు, మహిళలతో మంత్రి మాట్లాడారు. భోజనం సరిగ్గా ఉందా? అన్న క్యాం టీన్‌లో పెడుతున్న టిఫిన్‌, భోజనం ఉపయోగకరంగా ఉందా..? అని అడిగి తెలుసుకున్నారు. భోజనం చేస్తున్న వారు చాలా బాగుంది అని చెప్పారు. మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు వైసీపీ జీర్ణించుకోలేకపో తుందన్నారు.

Updated Date - May 22 , 2026 | 11:26 PM