Share News

ఘంటసాల పాటలు మధురం

ABN , Publish Date - Feb 09 , 2026 | 12:16 AM

ఘంటసాల పాటలు మధురమని శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ పాకాల కొండయ్య అన్నారు.

ఘంటసాల పాటలు మధురం
గాయకులను సత్కరిస్తున్న కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య

శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ పాకాల కొండయ్య

కర్నూలు కల్చరల్‌, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): ఘంటసాల పాటలు మధురమని శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ పాకాల కొండయ్య అన్నారు. ఆదివారం రాత్రి నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో దివంగత తెలు గు సినీ నేపథ్య గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు వర్ధంతి సభ, ఘంటసాల పాటల సంగీత విభావరి నిర్వహించారు. ఈ సందర్భంగా ఘంటసాల చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. పాకాల కొండయ్య మాట్లాడుతూ ఘంటసాల పాటలు నేటికీ జన ఆదరణ పొందుతున్నాయన్నారు. టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు, కళారత్న పత్తి ఓబులయ్య మాట్లాడుతూ జిల్లా స్థాయి అధికారిగా ఉన్న పాకాల కొండ య్య ఘంటసాల గారిపై ఉన్న అభిమానంతో ఆయన జయంతి, వర్ధంతి ఉత్సవాలకు రాష్ట్రం లోని పలు ప్రాంతాల నుంచి గాయకులను ఆహ్వా నించి సంగీత విభావరులు నిర్వహించడం స్ఫూర్తిదాయకమని చెప్పారు. అనంతరం కావలికి చెందిన నెల్లూరు రామచంద్రరావు, విజయ వాడకు చెందిన ఎస్‌పీ శ్రీదేవి, విజయ వాడకు చెందిన జెస్సీలతోపాటూ పాకాల కొండయ్యలు నిర్వహించిన ఘంట సాల సంగీత విభావరి ప్రేక్షకులను అలరింపజేసింది. కార్యక్రమంలో కళాక్షేత్రం కార్య దర్శి సి.యాగంటీశ్వ రప్ప, సీనియర్‌ రంగస్థల కళాకారుడు వీవీ రమణారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Feb 09 , 2026 | 12:16 AM