వైసీపీ నాయకుల తీరు బాధాకరం
ABN , Publish Date - Feb 22 , 2026 | 12:10 AM
కలి యుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూ తయా రీలో కల్తీ నెయ్యి వాడి అపచారం చేసిన వైసీపీ నాయ కులు తీరు బాధాకరమని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు.
సంకల్‌బాగ్ ఆలయ శుద్ధిలో మంత్రి టీజీ భరత్
కర్నూలు అర్బన్, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): కలి యుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూ తయా రీలో కల్తీ నెయ్యి వాడి అపచారం చేసిన వైసీపీ నాయ కులు తీరు బాధాకరమని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. శనివారం నగరంలోని సంకల్‌బాగ్ వెంక టేశ్వర స్వామి ఆలయంలో కుడా చైర్మన్ సోమిశెట్టి వెంక టేశ్వర్లు, టీడీపీ జిల్లా అధ్యక్షు రాలు గుడిసెక్రిష్ణమ్మలతో కలిసి ఆలయంలో శుద్ధి, పూజ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకులు శాసనమండలిలో చెప్పులేసుకుని వెంక టేశ్వరస్వామి ఫొటోలు ప్రదర్శించడం అభ్యంతరకరమని అన్నారు. బొందిలి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్, మార్కెట్ యార్డు డైరెక్టర్ మారుతి శర్మ పాల్గొన్నారు.
వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కవు
వైసీపీ పార్టీకి అధ్యక్షుడిని మార్చుకోవాలని, జగన్ కొనసాగితే వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కవని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. శనివారం జిల్లా టీడీపీ కార్యాలయంలో కుడా చైర్మన్ సోమిశెట్టి వెంక టేశ్వర్లు, జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ తిరుమల లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిందని వైఎస్ జగన్ తిరుమలకు వెళ్లి తప్పు ఒప్పుకొని స్వామి దగ్గర క్షమాపణలు చెప్పాలని, హిందుత్వాన్ని దెబ్బ తీయాలనే ఇదంతా చేస్తున్నారన్న సందేహం కలుగు తోందన్నారు. ఆపార్టీ నాయకుల ధోరణి ఇప్పటికీ మారడం లేదన్నారు. వైసీపీ అధ్యక్షుడిగా జగన్‌ను మార్చి ఇంకో వ్యక్తిని ఎన్నుకోవాలన్నారు. 2039వరకు కూటమి ప్రభు త్వం అఽధికారంలో ఉంటుందని సీనియర్ ఐఏఎస్‌లు తనతో చెప్పారన్నారు. కూటమి పాలన ఎంత బాగుందో దీన్ని బట్టి తెలుస్తోందన్నారు.