Share News

పాణ్యం అభివృద్ధే కూటమి లక్ష్యం

ABN , Publish Date - Oct 14 , 2026 | 12:03 AM

పాణ్యం అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పాణ్యంలో రూ.5.30 కోట్లతో ఎమ్మెల్యే వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు.

పాణ్యం అభివృద్ధే కూటమి లక్ష్యం
పాణ్యంలో శిలాఫలకాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే

ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

రూ.5.30 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం

పాణ్యం, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి) : పాణ్యం అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పాణ్యంలో రూ.5.30 కోట్లతో ఎమ్మెల్యే వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో సేవాసంకల్ప్‌ అభియాన్‌ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికులను సత్కరించారు. గర్భిణులకు మందులు పంపిణీ చేశారు. ఈ ఏడాది ఆసుపత్రికి స్వఛ్చ ఆంధ్ర అవార్డు లభించడంపై డాక్టర్‌ వేణుగోపాలక్రిష్ణను అభినందించారు. అనంతరం వద్దెలవాగుపై రూ.2 కోట్ల ఆర్‌అండ్‌బీ నిధులతో నిర్మించిన వంతెనను, పాణ్యం బస్టాండు నుంచి గ్రామం కూడలి వరకు రూ.2.50 కోట్ల ఆర్‌అండ్‌బీ నిధులతో నిర్మించిన రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రూ,30 లక్షల ప్రహరీ పనులకు భూమిపూజ చేశారు. స్థానిక నర్సింగ్‌ కళాశాల స్థలంలో రూ49. 50 లక్షలతో నిర్మించ తలపెట్టిన రైతుబజార్‌ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. అనంతరం వెలుగు కార్యాలయం వద్ద వ్యవసాయ యంత్రాల బ్యాంకును ప్రారంభించారు. ప్రాసెసింగ్‌ యూనిట్‌ షెడ్డు నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎన్నో యేళ్లుగా అభివృద్ధికి నోచుకోని జఠిలమైన సమస్యలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిష్కారం అ య్యాయన్నారు ఇందులో భాగంగానే బనగానపల్లె పాణ్యం రహదారిలో ప్రమాదకరంగా మారిన వద్దెల వగు వంతెన నిర్మాణం పూర్తి చేశామన్నారు. పొదుపు సంఘాల మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ఈఈ శ్రీధర్‌రెడ్డి, తహశీల్దారు ప్రవీణ్‌కుమార్‌, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ లలిత, వెలుగు పీడీ శ్రీధర్‌రెడ్డి, ఎంఈఓలు కోటయ్య, సుబ్రహ్మణ్యం, ఏపిఓ శేషన్న, ఏపిఎం ప్రసాద్‌, మండల టీడీపీ కన్వీనర్‌ జయరామిరెడ్డి, నాయకులు ఖాధర్‌బాష, రాంమోహన్‌నాయుడు, రమణమూర్తి, రంగరమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 14 , 2026 | 12:05 AM