Share News

స్పష్టమైన ప్రకటన వచ్చే దాకా ఉద్యమం

ABN , Publish Date - Sep 04 , 2026 | 12:02 AM

కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్‌పై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే దాకా ఉద్యమం కొనసాగుతుందని బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బి.చంద్రుడు తెలిపారు.

 స్పష్టమైన ప్రకటన వచ్చే దాకా ఉద్యమం
దీక్షలో పాల్గొన్న న్యాయవాదులు

బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు చంద్రుడు

11వ రోజు దీక్ష కొనసాగించిన న్యాయవాదులు

కర్నూలు లీగల్‌, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్‌పై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే దాకా ఉద్యమం కొనసాగుతుందని బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బి.చంద్రుడు తెలిపారు. జిల్లా బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు చేపట్టిన నిరాహారదీక్షలు గురువారం 11వ రోజుకు చేరాయి. పలు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు శిబిరాన్ని సందర్శించి తమ సంఘీభావం తెలిపారు. మద్దతు తెలిపిన వారిలో ఏఐయూకేఎస్‌ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తిరుపాల్‌, పీడీఎ్‌సయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీవీ రమణ తదితరులు ఉన్నారు. కాగా 11వ రోజు నిరాహారదీక్షలో పాల్గొన్న వారిలో కె.మధు, నిఖిల్‌ గౌడు, జి.మురళీకృష్ణ, ఈ.బాలాజీ రెడ్డితో పాటు మొత్తం 14 మంది న్యాయవాదులు ఉన్నారు.

Updated Date - Sep 04 , 2026 | 12:02 AM