3వ పీఆర్‌సీని అమలు చేయాలి
ABN , Publish Date - Oct 02 , 2026 | 12:22 AM
భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ సంస్థలో పని చేసి పదవీ విరమణ పొందిన పెన్షనర్లకు, ఉద్యోగులకు 1.1.2017 నుంచి 3వ పీఆర్‌సీని అమలు చేయాలని ఆల్ ఇండియా బీఎ్‌సఎనఎల్ పెన్షనర్ల ఉద్యోగుల సంఘం సర్కిల్ అధ్యక్షుడు యాకోబు డిమాండ్ చేశారు.
జీఎం కార్యాలయం ఎదుట పెన్షనర్ల నిరసన
కర్నూలు న్యూసిటీ, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ సంస్థలో పని చేసి పదవీ విరమణ పొందిన పెన్షనర్లకు, ఉద్యోగులకు 1.1.2017 నుంచి 3వ పీఆర్‌సీని అమలు చేయాలని ఆల్ ఇండియా బీఎ్‌సఎనఎల్ పెన్షనర్ల ఉద్యోగుల సంఘం సర్కిల్ అధ్యక్షుడు యాకోబు డిమాండ్ చేశారు. బీఎ్‌సఎనఎల్ ఎంప్లాయిస్ యూనియన, ఆల్ ఇండియా బీఎ్‌సఎనఎల్-డాట్ పెన్షనర్స్ అసోసియేషన, ఎనఎ్‌ఫటీయూ, ఎస్‌ఎనఈఏ, ఎస్‌డబ్ల్యూఈఏ, ఏఐబీఎ్‌సఎనఎల్‌ఈఏ, ఏఐబీడీపీఏ, ఏఐబీఎ్‌సఎనఎల్ అధ్వర్యంలో గురువారం జీఎం కార్యాలయం ఎదుట ఽభోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. ఈ సందర్భం గా యాకోబు మాట్లాడుతూ ఎనపీఎ్‌స, యూపీఎ్‌సలను రద్దు చేయాలన్నారు. పెన్షన రూల్స్ వాలిడేషన యాక్ట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న పెన్షనర్లందరికి పెన్షన రివిజన చేయాలన్నారు. బీఎ్‌సఎనఎల్, ఎంటీఎనఎల్ పెన్షనర్లకు జనవరి 1,2017 నుంచి పెన్షన సవరణ చేయాలన్నారు. మెడికల్ అలవెన్సును వెంటనే పెన్షనర్లకు పునరుద్ధ్దరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వివిధ యూనియన్ల నాయకులు రామరాజు, ఆదినారాయణ, శ్రీనివాసులు, రమేష్, మురళీకృష్ణ, మద్దిలేటి, విజయభాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.