Share News

రెడ్‌క్రాస్‌లో తలసీమియా కేంద్రం

ABN , Publish Date - May 16 , 2026 | 11:26 PM

రాష్ట్రంలో ఎక్కడా లేని విదంగా కర్నూలులోని రెడ్‌క్రాస్‌ సొసైటీ బ్లడ్‌ బ్యాంకులో రూ.1.50 కోట్లతో టీజీ వెంకటేశ్‌ తలసీమియా రక్తమార్పిడి సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ గుప్తా తెలిపారు.

రెడ్‌క్రాస్‌లో తలసీమియా కేంద్రం
పూజ చేస్తున్న మంత్రి, కర్నూలు ఎంపీ

రూ.కోటి విరాళం ప్రకటించిన మంత్రి

తొలి విడతగా రూ.25 లక్షలు అందజేత

కర్నూలు హాస్పిటల్‌, మే 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎక్కడా లేని విదంగా కర్నూలులోని రెడ్‌క్రాస్‌ సొసైటీ బ్లడ్‌ బ్యాంకులో రూ.1.50 కోట్లతో టీజీ వెంకటేశ్‌ తలసీమియా రక్తమార్పిడి సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ గుప్తా తెలిపారు. శనివారం ఉదయం నగరంలోని రెడ్‌క్రాస్‌ సొసైటీ బ్లడ్‌ బ్యాంకులో నిర్మించతలపెట్టిన టీజీ వెంకటేశ్‌ తలసేమియా రక్తమార్పిడి కేంద్రానికి మంత్రి, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజుతో కలిసి భూమి పూజ నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ మా తండ్రి మాజీ మంత్రి టీజీ వెంకటేశ్‌ జన్మదినం సందర్బంగా టీజీవీ గ్రూప్‌ నుంచి ఒక కోటి రూపాయల విరాళంను తలసేమియా రక్తమార్పిడి కేంద్రానికి ప్రకటించామన్నారు. అందులో భాగంగా ప్రస్తుతం రూ.25లక్షల చెక్కును రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా చైర్మన్‌ డా.కేజీ గోవిందరెడ్డికి అందజేశారు. కర్నూలు మెడికల్‌ కాలేజీలో పూర్వ విద్యార్థులతో నాలెడ్జ్‌ సెంటర్‌ కోసం 70 సెంట్ల స్థలాన్ని కేటాయించామన్నారు. ఫారిన్‌ ఫండ్స్‌ నుంచి అకౌంట్‌ను ఓపెన్‌ చేయిస్తే నిధులు వస్తాయనీ, దాదాపు 50 నుంచి రూ.60 కోట్లతో నాలెడ్జ్‌ సెంటర్‌ భవనం ఏర్పాటు చేస్తామన్నారు. ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విదంగా కర్నూలులో తలసేమియా కేంద్రం ఏర్పాటు చేయడం శుభపరిణా మన్నారు. మాజీ మంత్రి టీజీ వెంకటేశ్‌ జన్మదినం సందర్బంగా స్టేట్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూ ట్‌కు అవసరమైన మైక్రోటాం పరికరం కొనుగోలుకు 9లక్షల ఎంపీ నిధుల నుంచి కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. డీఎంహెచ్‌వో డా.వై.కామేశ్వర ప్రసాద్‌, జిల్లా రెవెన్యూ అఇకారి వెంకటనారాయణమ్మ, రెడ్‌క్రాస్‌ సొసైటీ సభ్యులు డా.కే.అరుణ, జి.శ్రీనివాసులు, డా.కేవీ సుబ్బారె డ్డి, బాబురాజు, భీమా శంకర్‌ రెడ్డి, మీనాక్షి, రఘునాథరెడ్డి, మెడికల్‌ ఆఫీసర్లు పాల్గొన్నారు.

Updated Date - May 16 , 2026 | 11:26 PM