Share News

తహసీల్దార్‌ కావలెను

ABN , Publish Date - Apr 16 , 2026 | 12:43 AM

తహసీల్దార్‌ కార్యాలయంలో అధికారుల కొరతతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. మొన్నటి వరకు ఇన్‌చార్జిగా వ్యవహరించిన డిప్యూటీ తహసీల్దార్‌ సాయి విశ్వతేజ వ్యక్తిగత కారణాలతో సెలవులో వెళ్లిపోయారు. దీంతో సమస్య మొదటికి వచ్చింది.

తహసీల్దార్‌ కావలెను
అధికారులు లేక ఖాళీగా దర్శనమిస్తున్న కుర్చీలు

కొలిమిగుండ్ల మండలంలో రెగ్యులర్‌ తహసీల్దార్‌ లేక ప్రజల అవస్థలు

సెలవులో వెళ్లిపోయిన ఇన్‌చార్జి తహసీల్దార్‌

సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఖాళీ..

కొలిమిగుండ్ల, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): తహసీల్దార్‌ కార్యాలయంలో అధికారుల కొరతతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. మొన్నటి వరకు ఇన్‌చార్జిగా వ్యవహరించిన డిప్యూటీ తహసీల్దార్‌ సాయి విశ్వతేజ వ్యక్తిగత కారణాలతో సెలవులో వెళ్లిపోయారు. దీంతో సమస్య మొదటికి వచ్చింది.

ఇక్కడ పనిచేసేందుకు ముందుకు రాని అధికారులు

మండలంలో ఉన్న రాజకీయ ఒత్తిడుల కారణంగా ఇక్కడికి రెగ్యులర్‌ తహసీల్దార్‌గా వచ్చేందుకు అధికారులు ఇష్టపడం లేదు. ఒకవేళ ఉన్నతాధికారులు బలవంతంగా పంపినా, కొన్ని రోజులు పనిచేసి సెలవులో వెళ్లిపోతవడం పరిపాటిగా మారింది.

ఆర్‌ఐ ఒక్కరే..

కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌ తప్ప ఉన్నతాధికారులు ఎవరూ అందుబాటులో లేరు. దీంతో కార్యాలయానికి వచ్చే ప్రజలు నిరాశతో వెనుదిరుగుతనాఆ్నరు.

గతంలో ఇక్కడ పనిచేసిన తహసీల్దార్‌ బదిలీపై బనగానపల్లెకు వెళ్లారు. ఆయన స్థానంలో డీటీకి ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించినా ఆయన కూడా సెలవుపై వెళ్లారు. దీంతో కార్యాలయంలో తహసీల్దార్‌ మొదలుకొని డిప్యూటీ తహశీల్దార్‌, సీనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, ఇతర సిబ్బంది లేరు. దీంతో కార్యాలయం బోసిపోయింది. ఎవరైనా కార్యాలయానికి వస్తే ఈ రోజు సెలవు దినామా? అన్న సందేశం కలుగక మానదు.

సర్టిఫికెట్ల కోసం విద్యార్థుల అగచాట్లు

త్వరలోనే విద్యా సంవత్సరం ప్రారంభం కానుండటంతో విద్యార్థులు కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు మండలంలో సుమారు ఆరు మందికి పైగా వీఆర్‌ఓల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. మండలంలోని రెవెన్యూ శాఖ మొత్తం ఖాళీగా ఉండడంతో రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి రెగ్యులర్‌ తహసీల్దార్‌తో పాటు, మిగతా అధికారులను నియమించాలని మండల ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Apr 16 , 2026 | 12:43 AM