Share News

పాఠ్య పుస్తకాలు వచ్చేశాయ్‌..

ABN , Publish Date - May 14 , 2026 | 11:52 PM

ప్రస్తుత విద్యా సంవత్సరంలో విద్యార్థులకు అందించేందుకు ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు వచ్చేశాయి. ప్రభుత్వ బడుల బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ప్రతి విద్యార్థి చేతిలో అన్ని పుస్తకాలు ఉండేలా చర్యలు చేపట్టారు. జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 1145 ఉన్నాయి.

పాఠ్య పుస్తకాలు వచ్చేశాయ్‌..
ఆలూరులో బాయ్స్‌ హైస్కూల్‌లో భద్రపరిచిన పాఠ్య పుస్తకాలు

పంపిణీకి సిద్ధం చేస్తున్న విద్యాశాఖ అధికారులు

ఆలూరు, మే 14 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత విద్యా సంవత్సరంలో విద్యార్థులకు అందించేందుకు ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు వచ్చేశాయి. ప్రభుత్వ బడుల బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ప్రతి విద్యార్థి చేతిలో అన్ని పుస్తకాలు ఉండేలా చర్యలు చేపట్టారు. జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 1145 ఉన్నాయి. ఇందులో 1-10వ తరగతి వరకు 2,64,885 మంది విద్యార్థులున్నారు. వీరికి 13,88,226 పాఠ్య పుస్తకాలు అవసరం ఉండగా, 3,58,554 మాత్రమే మొదటి విడత కింద ఆయా మండలాలకు సరఫరా చేసినట్లు డీఈవో సుధాకర్‌ తెలిపారు. రెండో విడతలో పూర్తిస్థాయిలో సరఫరా అవుతాయన్నారు. అన్నిరకాల పాఠ్య పుస్తకాలు ప్రత్యేక బస్‌లో మండల కేంద్రానికి చేర్చారు. ఆలూరులో బాలుర ఉన్నత పాఠశాల-1లో నిల్వ ఉంచారు. అనంతరం జూన్‌ ఒకటి నుంచి పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే హెచ్‌ఎంలకు సమాచారం అందించారు. నూతన విద్యా సంవత్సరాన్ని పురస్కరించుకొని జూన్‌ 12న ప్రారంభం రోజునే పుస్తకాలు, విద్యాసామగ్రి అందించనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.

Updated Date - May 14 , 2026 | 11:52 PM