Share News

టెట్‌పై పునరాలోచించాలి: ఎస్టీయూ

ABN , Publish Date - Aug 28 , 2026 | 12:09 AM

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఇన సర్వీసు ఉపాధ్యాయుల కోసం విడుదల చేసిన టెట్‌ నోటిఫికేషనపై పునరాలోచించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టీకే జనార్దన, ఎంసీ సుంకన్న డిమాండ్‌ చేశారు.

టెట్‌పై పునరాలోచించాలి: ఎస్టీయూ
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న ఎస్టీయూ నాయకులు

కర్నూలు ఎడ్యుకేషన, ఆగస్టు 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఇన సర్వీసు ఉపాధ్యాయుల కోసం విడుదల చేసిన టెట్‌ నోటిఫికేషనపై పునరాలోచించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టీకే జనార్దన, ఎంసీ సుంకన్న డిమాండ్‌ చేశారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌ ఎదుట వారు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇన సర్వీసు ఉపాధ్యాయుల టెట్‌లో ఉన్న అసం బంధమైన అంశాలను తొలగించాలని, టెట్‌ నుంచి ఉపాధ్యాయులకు పూర్తి మిన హాయింపు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ఎస్‌.గోకారి, మహాదేవప్ప, ఎం.శ్రీధర్‌, సి.నరసింహుడు, ప్రదీప్‌ కుమా ర్‌, ఎల్లప్ప, రమణ, విగ్నేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 28 , 2026 | 12:09 AM