Share News

పదో తరగతి విద్యార్ధి మృతి

ABN , Publish Date - Mar 21 , 2026 | 01:12 AM

పట్టణ సమీపంలోని జ్యోతి స్కూల్‌ వద్ద ట్రాక్టర్‌ ప్రమాదంలో పదో తరగతి విద్యార్ధి కిషక్షర్‌(16) శుక్రవారం మృతి చెందాడు.

 పదో తరగతి విద్యార్ధి మృతి
మృతి చెందిన కిషోర్‌

కోవెలకుంట్ల, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): పట్టణ సమీపంలోని జ్యోతి స్కూల్‌ వద్ద ట్రాక్టర్‌ ప్రమాదంలో పదో తరగతి విద్యార్ధి కిషక్షర్‌(16) శుక్రవారం మృతి చెందాడు. ఎస్‌ఐ మల్లికార్జున్‌ రెడ్డి తెలిపిన మేరకు.. బనగానపల్లె మండలం రామతీర్థం గ్రామానికి చెందిన లాజరు కొడుకు కిషోర్‌ బనగానపల్లె మోడల్‌ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. బంధువులతో కలిసి ట్రాక్టర్‌ తీసుకొని కోవెలకుంట్ల మండలం పొట్టిపాడు గ్రామానికి వెళ్లి ధాన్యం ట్రాక్టర్‌లో వేసుకొని తిరిగి గ్రామానికి బయలుదేరాడు. అయితే జ్యోతి స్కూల్‌ వద్ద స్పీడ్‌ బ్రేకర్‌ను గమనించని డ్రైవర్‌ వేగంగా వెళ్లడంతో పక్కనే కూర్చున్న కిషోర్‌ ఎగిరి ట్రాక్టర్‌ కిందపడ్డాడు. క్షతగాత్రుడిని కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి అనంతరం మెరుగైన వైద్యం కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా కోలుకోలేక మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Mar 21 , 2026 | 01:12 AM