Share News

టెన్షన్‌.. టెన్షన్‌

ABN , Publish Date - Jan 31 , 2026 | 12:46 AM

మారుతున్న రాజకీయ పరిణామాల్లో భాగంగా ఎలాగైనా ఎంపీపీ పీఠం నుంచి సువర్ణమ్మను దించాలన్న అవిశ్వాస తీర్మానం ఎట్టకేలకు శనివారం వేదిక కానుంది. సజావుగా జరిగేందుకు అధికారులు శుక్రవారం ఎన్నిక జరిగే సమావేశమందిరాన్ని తహసీల్దార్‌ చంద్రశేఖర్‌నాయక్‌, ఎంపీడీవో గోపికృష్ణ, ఎస్‌ఐ మల్లికార్జున పరిశీలించారు.

టెన్షన్‌.. టెన్షన్‌
జూపాడుబంగ్లా ఎంపీడీవో కార్యాలయం

నేడు ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం

భారీగా పోలీసుబందోబస్తు

ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

జూపాడుబంగ్లా, జనవరి 30 (ఆంధ్రజ్యోతి):మారుతున్న రాజకీయ పరిణామాల్లో భాగంగా ఎలాగైనా ఎంపీపీ పీఠం నుంచి సువర్ణమ్మను దించాలన్న అవిశ్వాస తీర్మానం ఎట్టకేలకు శనివారం వేదిక కానుంది. సజావుగా జరిగేందుకు అధికారులు శుక్రవారం ఎన్నిక జరిగే సమావేశమందిరాన్ని తహసీల్దార్‌ చంద్రశేఖర్‌నాయక్‌, ఎంపీడీవో గోపికృష్ణ, ఎస్‌ఐ మల్లికార్జున పరిశీలించారు. అవిశ్వాస తీర్మాన పత్రాన్ని ఇచ్చిన వెంటనే దానిని ఆమోదించి ఈనెల 31న ఏర్పాటు చేయాలని ఎన్నికల అధికారి, ఆర్డీవో నాగజ్యోతి ఉన్న 9మంది ఎంపీటీసీలకు నోటీసులు జారీ చేయడంతో రాజకీయపార్టీలో వేడి పుంజుకుంది. దీంతో రాజకీయపార్టీలు అనుకూలమైన ఎంపీటీసీలను క్యాంపులకు తీసుకెళ్లడం, జూపా డుబంగ్లా టీడీపీ నాయకుడు పెద్దన్నను నరసరావుపేట వద్ద దాడిచేసి ఆయన వెంట ఉన్న ఎంపీటీసీనీ వైసీపీ నాయకులు కిడ్నాప్‌ చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో కేసులు నమోదు కావడం రాష్ట్రమంతా చర్చనీయాంశమైంది. అప్పటి నుంచి అధిష్ఠానం సీరియ్‌సగా ఉండటంతో అవిశ్వాసం మరింత బలానిచ్చింది. ఎవరికి వారు టీడీపీ, వైసీపీ నాయకులు ఎంపీటీసీలను ప్రసన్నం చేసుకోవడానికి వారికి తాయిలాలు కూడా ఆశజూపినట్లు తెలుస్తోంది. అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 9మంది ఎంపీటీల్లో టుబై తర్డ్‌ అంటే 6గురు ఎంపీటీసీల మెజార్టీ అవసరం అవుతోంది. ఇన్నీ పరిణామాలు జరిగిన నేపద్యంలో ఏమైనా జరగవచ్చన్న అనుమానంతో ఎన్నిక జరిగే సమయంలో భారీగా పోలీసుబందోబస్లు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న ఎంపీపీ అవిశ్వాసతీర్మాణాన్ని మెజార్టీతో పదవి నిలబెట్టుకుంటుందా లేక టీడీపీకి అనుకూలంగా ఉన్న ఎంపీటీసీలు ఎంపీపీని గద్దే దించి నూతన ఎంపీపీని ఎన్నుకుంటారన్న సందేహాలు జూపాడుబంగ్లా మండలంలో చర్చనీయాంశమైంది.

Updated Date - Jan 31 , 2026 | 12:46 AM