అలా్ట్రటెక్‌లో ఉద్రిక్తత
ABN , Publish Date - Mar 17 , 2026 | 11:58 PM
మండలంలోని పెట్నీకోట పరిధిలో నిర్మితమవుతున్న అలా్ట్రటెక్ పరిశ్రమలో ఉద్రిక్తత నెలకొంది. పనికి తగ్గ వేతనం ఇవ్వడం లేదంటూ పరిశ్రమలో పని చేస్తున్న వేలాది మంది కార్మికులు మంగళవారం నిరసన చేపట్టారు.
పనికి తగ్గ వేతనం ఇవ్వడంలేదంటూ కార్మికుల నిరసన
కొలిమిగుండ్ల, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పెట్నీకోట పరిధిలో నిర్మితమవుతున్న అలా్ట్రటెక్ పరిశ్రమలో ఉద్రిక్తత నెలకొంది. పనికి తగ్గ వేతనం ఇవ్వడం లేదంటూ పరిశ్రమలో పని చేస్తున్న వేలాది మంది కార్మికులు మంగళవారం నిరసన చేపట్టారు. పరిశ్రమ నిర్మాణ పనులు పూర్తిగా ఆగిపోయాయి. వేతనాలు చెల్లించాలం టూ కార్మికులను అలా్ట్రటెక్ పరిశ్రమ పనులకు తీసుకవచ్చిన కాంట్రాక్టు సంస్థ కార్యాలయంపై కార్మికులు దాడికి దిగారు. బిహార్, చత్తీ్‌సగడ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన 4వేల మంది కార్మికులు కాంట్రాక్టు సంస్థల కింద పని చేస్తున్నారు. నూతన కార్మిక చట్టాల ప్రకారం కార్మికులు 8గంటలకు మించి పనులు చేస్తే అదనపు వేతనం చెల్లించాల్సి ఉంటుంది. అలా్ట్రటెక్ పరిశ్రమలో కార్మికులతో 12గంటలకు పైగా పనులు చేయించుకుంటూ అదనపు వేతనాలు చెల్లించడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. రెండు రోజులుగా విధుల్లోకి వెళ్లకుండా నిరసన చేస్తూ, ఘర్షణకు దిగుతున్నారు. దీంతో కొలిమిగుండ్ల సీఐ రమే్‌షబాబు పోలీసులతో కలిసి అలా్ట్రటెక్ పరిశ్రమకు చేరుకొని కార్మికులతో చర్చించారు. ఉద్రిక్తతలను తగ్గించడానికి లేబర్ కాలనీ నుంచి సిమెంట్ పరిశ్రమలోకి వెళ్లకుండా పోలీసులు కార్మికులను అడ్డుకుంటున్నారు. కార్మికులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఏక్షణాన ఏం జరుగుతుందోనని అటు పరిశ్రమ వర్గాలు, ఇటు పోలీసులు ఆందోళన చెందుతున్నారు.
ఆకలి కేకలు
మరోవైపు పరిశ్రమలో వంటగ్యాస్ కొరత కారణంగా ఆకలి కేకలు చోటు చేసుకుంటున్నాయి.గ్యాస్ దొరకక పోవడంతో కష్టాలు పడుతున్నారు. కార్మికులతో పనులు చేయించుకుంటున్న కాంట్రాక్టు సంస్థలు, యజమాన్యాలు వారి కష్టాలను పట్టించుకోక పోవడంతో వారు మరింత ఆగ్రహానికి లోనవుతున్నారు. మొన్నటి వరకు కేజీ రూ.100కు బయట మార్కెట్లో దొరికే వంట గ్యాస్ ప్రస్తుతం బ్లాక్ మార్కెట్లో కేజీ రూ.300కు పైగా విక్రయిస్తుండటంతో కార్మికులు కొనలేని పరిస్థితులు నెలకొన్నాయి. కార్మికుల ఆవేశానికి ఇది కూడా ఒక కారణంగా పలువురు పేర్కొంటున్నారు.