Share News

తిప్పాయిపల్లెలో ఉద్రిక్తత

ABN , Publish Date - Apr 16 , 2026 | 11:30 PM

: రైతుల అనుమతుల్లేకుండా మెగా కంపెనీ విద్యుత్‌ టవర్లు, తీగలు, నిర్మాణ పనులు చేపడుతోంది.

తిప్పాయిపల్లెలో ఉద్రిక్తత
పొలాల వద్ద రైతులను లాక్కెళ్తున్న పోలీసులు

పనులను అడ్డుకున్న రైతులు

అరెస్టు చేసిన పోలీసులు

జాతీయ రహదారి దిగ్బంధం

భారీగా నిలిచిన వాహనాలు

ఓర్వకల్లు, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): రైతుల అనుమతుల్లేకుండా మెగా కంపెనీ విద్యుత్‌ టవర్లు, తీగలు, నిర్మాణ పనులు చేపడుతోంది. వీటిని రైతులు అడ్డుకోవడంతో మండలంలోని తిప్పాయిపల్లె గ్రామం లో ఉద్రిక్తత నెలకొంది. నోటీసులు ఇవ్వకుండా నష్టపరిహారం చెల్లిం చకుండా పనులు ప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తూ గురువారం రైతులు పనులను అడ్డుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని పనులు అడ్డుకో కుండా యథావిఽధిగా కొనసాగించేందుకు అధికారుల ఆదేశాల మేరకే వచ్చామని రైతులకు తెలిపారు. అయినా కూడా రైతులు ససేమిరా అనడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బాధిత రైతులు సుంకిరెడ్డి, సుధాకర్‌, బషీర్‌ అహ్మద్‌, శ్రీనివాసులు రెడ్డి, నాగార్జునరెడ్డి, గోపాల్‌ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జీపులో బలవంతంగా ఎక్కించి పోలీసుస్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ, నాయకులు నాగన్న, మధుసూ దన్‌, చంద్రబాబు నాయుడు, షాజహాన్‌, శ్రీధర్‌తో కలిసి పోలీస్‌స్టేషన్‌ ఎదురుగా జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఎక్క డికక్కడ భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు ఇబ్బందులకు గుర య్యారు. పోలీసులు అరెస్టు చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని, నష్టపరిహారం చెల్లించేదాకా విద్యుత్‌ టవర్ల పనులు నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ భారీఎత్తున నినాదాలు చేశారు. న్యాయం కోసం రైతులు అడిగితే పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకెళ్లడం సరికాదన్నారు. రైతులను విడుదల చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో రాస్తారోకోను విరమింపజేశారు. ఎస్‌ఐ సునీల్‌కుమార్‌ చర్చలు జరిపి రైతులను వదిలివేశామన్నారు. రైతుల అరెస్టు సమయంలో రైతు సుంకిరెడ్డి వద్ద ఉన్న సెల్‌ఫోన్‌, రూ.20వేల నగదు పోయినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో రైతులు బుగ్గరాముడు, సూర్యనారాయణ, మద్దిలేటి, రాజన్న, దస్తగిరి, ఎర్రమల మద్దిలేటి పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2026 | 11:30 PM