Share News

కొలిమిగుండ్లలో ఉద్రిక్తత

ABN , Publish Date - Oct 24 , 2026 | 12:19 AM

నామినేషన్ల కేంద్రం వద్ద శుక్రవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. నామినేషన్లు వేసే గడువు ముగిసే సమయంలో అక్కడకు వచ్చిన వైసీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. టీడీపీ, వైసీపీ నాయకులకు తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.

కొలిమిగుండ్లలో ఉద్రిక్తత
కొలిమిగుండ్లలో ఘర్షణ పడుతున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు

నామినేషన్‌ కేంద్రం వద్ద వైసీపీ శ్రేణుల కవ్వింపు చర్యలు

ఫ టీడీపీ, వైసీపీ శ్రేణుల ఘర్షణ, చెదరగొట్టిన పోలీసులు

కొలిమిగుండ్ల, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): నామినేషన్ల కేంద్రం వద్ద శుక్రవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. నామినేషన్లు వేసే గడువు ముగిసే సమయంలో అక్కడకు వచ్చిన వైసీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. టీడీపీ, వైసీపీ నాయకులకు తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.

మాట తప్పిన వైసీపీ

ఎంపీటీసీ స్థానాలను టీడీపీ, వైసీపీ నాయకులు సయోధ్య కుదుర్చుకున్నారు. 15ఎంపీటీసీ స్థానాలుండగా, 10-టీడీపీ, వైసీపీ-5 స్థానాల్లో పోటీ చేసేలా మంతనాలు సాగించారు. అయితే చివరి నిమిషంలో మాట తప్పిన వైసీపీ నేతలు టీడీపీకి కేటాయించిన రెండు స్థానాల్లో నామినేషన్లు వేశారు. అనంతరం బటయకు వచ్చి టీడీపీ కార్యకర్తల వైపు వేలు చూపడంతో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయారు. అప్రమత్తమైన సీఐ రమేష్‌ బాబు, పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టడంతో గొడవ సద్దుమణిగింది.

ప్యాపిలిలో ఉద్రిక్తత

ప్యాపిలి: నామినేషన్‌ కేంద్రం వద్ద శుక్రవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్యాపిలి-3, మాధవరం, బూరుగుల, కలచట్ల ఎంపీటీసీ స్థానాలకు జనసేన అభ్యర్థులు నామినేషన్‌ వేసేందుకు రాగా పోలీసులు అడ్డుకునే యత్నం చేశారు. దీంతో పోలీసులకు, జనసేన నాయకుల మధ్య వాగ్వావారం చోటుచేసుకుంది. చివరకు పోలీసులు లాఠీ చార్జీ చేయడతో పలువురు కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. సీఐ వెంకటరామిరెడ్డి జోక్యం చేసుకొని నామినేషన్‌ పత్రాలు సరిగా ఉంటే, ఇద్దరిని మాత్రమే లోపలికి అనుమతిస్తామని చెప్పారు. గుంపులుగా లోపలికి రావడం వల్లనే జనసేనా నాయకులతో వివాదం చోటుచేసుకుందని తెలిపారు.

Updated Date - Oct 24 , 2026 | 12:19 AM