కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
ABN , Publish Date - Nov 08 , 2026 | 12:34 AM
ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ కౌంటింగ్ కేంద్రం వద్ద వైసీపీ శ్రేణులు అత్యుత్సాహంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
టీడీపీ నాయకుడిని అనుమతించడంపై వైసీపీ ఆందోళన
ఎమ్మిగనూరు, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ కౌంటింగ్ కేంద్రం వద్ద వైసీపీ శ్రేణులు అత్యుత్సాహంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కౌంటింగ్ సరళిని పరిశీలించడానికి వచ్చిన టీడీపీ జిల్లా ఉపాఽధ్యక్షుడు భాస్కర్ల చంద్రశేఖర్‌ను కేంద్రం ఆవరణలోకి అనుమతించడంపై వైసీపీ శ్రేణులు నానాయాగి చేశారు. దీంతో చంద్రశేఖర్ స్వచ్ఛందంగా బయటకు వెళ్లిపోయారు.
తప్పుడు సమాచారంతో వైసీపీ నాయకుడి హల్‌చల్
పార్లపల్లి కౌంటింగ్‌పై తప్పుడు సమాచారం తెలుసుకొని కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకున్న వైసీపీ నాయకుడు బసిరెడ్డి కాసేపు హల్‌చల్ చేశారు. ఫలితంపై పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తప్పుడు సమాచారంతో మాట్లాడవద్దని బసిరెడ్డికి పోలీసులు ఘాటుగా జవాబిచ్చారు. ఏ తప్పూ జరగడం లేదని సొంత పార్టీ నాయకులే చెప్పినా బసిరెడ్డి నానా హంగామా చేశారు. దీంతో రూరల్ ఎస్‌ఐ శ్రీనివాసులు బసిరెడ్డిని కౌంటర్ కేంద్రంలోకి తీసుకెళ్లి ఆయన అనుమానాలను తీర్చారు. అప్పటి దాకా నానా హంగామా చేసి పోలీసులతో వాగ్వాదానికి దిగిన బసిరెడ్డి ఏ తప్పు జరగటం లేదని తెలుసుకున్న సైలెంటుగా బయటకు వెళ్లిపోయారు. టౌన్‌సీఐ కంబగిరి రాముడు మాట్లాడుతూ తప్పుడు సమాచారంతో కౌంటింగ్ కేంద్రం వద్దకు అనుచరులను వెంటబెట్టుకొని వచ్చి గొడవ చేశారని చెప్పారు.