కల్లూరు ఎంపీపీ పీఠంపై ఉత్కంఠ
ABN , Publish Date - Nov 12 , 2026 | 12:02 AM
కల్లూరు ఎంపీపీ పీఠం ఎవరికి దక్కుతుందో అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. కల్లూరు ఎంపీపీ స్థానాన్ని జనరల్‌కు కేటాయించడంతో ఆశావహులు, సీనియర్లు, ఎన్నికల్లో గెలుపొం దిన ఎంపీటీసీలు ఎంపీపీ పీఠం దక్కించుకునేందుకు పావులు కదుపుతు న్నారు.
ఎంపీపీ జనరల్‌కు కేటాయించడంతో తీవ్ర పోటీ
కల్లూరు, నవంబరు 11(ఆంధ్రజ్యోతి) కల్లూరు ఎంపీపీ పీఠం ఎవరికి దక్కుతుందో అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. కల్లూరు ఎంపీపీ స్థానాన్ని జనరల్‌కు కేటాయించడంతో ఆశావహులు, సీనియర్లు, ఎన్నికల్లో గెలుపొం దిన ఎంపీటీసీలు ఎంపీపీ పీఠం దక్కించుకునేందుకు పావులు కదుపుతు న్నారు. మండలంలో 13 ఎంపీటీసీ స్థానాలుండగా టీడీపీకి 10, వైసీపీ 3 స్థానాలు దక్కాయి. ఎంపీటీసీ అభ్యర్తుల తరుపున టీడీపీ- 16,078, వైసీపీకి-14,050 ఓట్లు వచ్చాయి. కల్లూరు జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థిగా వాకిటి మాధవి 1898 ఓట్ల మోజార్టీతో విజయం సాధించారు.
ఆశావహుల్లో ఉత్కంఠ
ఎంపీటీ పీఠం జనరల్‌కు కేటాయించడంతో ఆశావహుల్లో తీవ్ర పోటీ నెలకొంది. ఎంపీటీసీలుగా గెలుపొందిన నాయకులు ఇప్పటికే ఎమ్మెల్యే గౌరు చరిత, నందికొట్కూరు టీడీపీ ఇన్‌చార్జి గౌరు వెంక టరెడ్డిని కలిసి తమ అభిప్రాయాలను సూచించారు. మండలంలోని ఉలింద కొండ, బొల్లవరం, కొంగనపాడు, తడకనపల్లె గ్రామాల్లో గెలిచిన ఎంపీటీసీలు ఎంపీపీ పీఠం దక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా మండలంలోని టీడీపీ సీనియర్లు, నాయకుల మద్దతు కూడ గట్టేందుకు అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంపీపీ పీఠం ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే.
పార్టీల వారిగా పోలైన ఓట్లు
కల్లూరు మండలంలో 13 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన పరిషత్ ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. మొత్తం 38,479 మంది ఓటర్లుండగా ఎంపీటీసీ ఎన్నికల్లో 31485 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారు.
గ్రామాల వారీగా పోలైన ఓట్లు
గ్రామం టీడీపీ వైసీపీ
ఏ.గోకులపాడు 1147 1215
బస్తిపాడు 1230 1101
బొల్లవరం 1831 1465
చిన్నటేకూరు 1059 1265
కొంగనపాడు 952 907
నాయకల్లు 894 822
పర్ల-1 971 746
పర్ల-2 1137 593
పెద్దటేకూరు 1478 1337
సల్కాపురం 1571 1679
తడకనపల్లె 1325 1023
ఉలిందకొండ-1 1330 771
ఉలిందకొండ-2 1153 1126