ఫోర్‌మెన్ కమిటీ విచారణపై ఉత్కంఠ
ABN , Publish Date - Jan 31 , 2026 | 12:44 AM
పట్టణంలోని విజయ డెయిరీలో ఫోర్‌మెన్ కమిటీ పేరుతో శుక్రవారం నలుగురు అధికారులు కలిసి పలు అంశాలకు సంబంధించిన విషయాలపై విచారణ చేయడం సర్వత్ర ఉత్కంఠ రేపుతోంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. గత నెలలో సదరు డెయిరీలో పనిచేస్తున్న కొందరు కార్మికులు కలిసి తమకు నిబంధనలు ప్రకారం బెనిఫిట్స్ అందించకపోవడంతో పాటు తగిన భద్రత.. కార్మిక చట్టం ప్రకారం వేతనాలు, ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదని కలెక్టర్ రాజకుమారికి ఫీర్యాదు చేసినట్లు తెలిసింది
నెల కిందట కార్మికులు కలెక్టర్‌కు ఫిర్యాదు
మూడు గంటల పాటు సాగిన పక్రియ
ఫ సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశం
నంద్యాల, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని విజయ డెయిరీలో ఫోర్‌మెన్ కమిటీ పేరుతో శుక్రవారం నలుగురు అధికారులు కలిసి పలు అంశాలకు సంబంధించిన విషయాలపై విచారణ చేయడం సర్వత్ర ఉత్కంఠ రేపుతోంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. గత నెలలో సదరు డెయిరీలో పనిచేస్తున్న కొందరు కార్మికులు కలిసి తమకు నిబంధనలు ప్రకారం బెనిఫిట్స్ అందించకపోవడంతో పాటు తగిన భద్రత.. కార్మిక చట్టం ప్రకారం వేతనాలు, ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదని కలెక్టర్ రాజకుమారికి ఫీర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో కలెక్టర్ నలుగురు ఉద్యోగులతో కలిసి ఫోర్‌మెన్ కమిటీ నియమించి వచ్చిన ఫిర్యాదులు ఆధారంగా విచారణ చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని అదేశించారని ఆ వర్గాల నుంచి తెలిసింది. సదరు ఫోర్‌మెన్ కమిటీ విషయంతో కార్మికుల ఫిర్యాదు విషయం ఏమాత్రం బయటకు రాలేదు. ఉన్నఫలంగా తాజాగా సదరు డెయిరీలో విచారణ జరగడం ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
త్వరలో కలెక్టర్‌కు సమగ్ర నివేదిక
సదరు ఫోర్‌మెన్ కమిటీ సభ్యులు చేసిన విచారణ పరంగా సమగ్ర నివేదికను త్వరలో కలెక్టర్‌కు అందజేయనున్నట్లు తెలిసింది. విచారణ సమయంలో సదరు డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీ్‌పకుమార్ సైతం అందుబాటులో లేకపోవడం గమనార్హం. డెయిరీలోని కార్మికుల పరంగా గుర్తించిన లోపాల పరంగా సమగ్ర నివేదికను త్వరగా అందజేయాలని ఫోర్‌మెన్ కమిటీ డెయిరీ చైర్మన్‌కు ఆదేశించారు. దీంతో మేనేజింగ్ డైరెక్టర్ రాగానే.. అందజేస్తామని చైర్మన్ పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా సదరు డెయిరీ ఎన్నికల హడావిడిపై ఉత్కంఠ రేపగా.. తాజాగా ఫోర్ కమిటీ విచారణ తో మరీ సర్వత్ర ఉత్కంఠ రేపినట్లైంది. ఫోర్‌మెన్ కమిటీ నివేదికతో భవిష్యత్‌లో ఏమైనా చర్యలు ఉంటాయో..? లేక కార్మికుల ఫిర్యాదుతోనే ఆగిపోతుందా..? అనే సందేహాలు లేకపోలేదు.
మధ్యాహ్నం 3గంటల సమయంలో..
విజయ డెయిరీలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఫోర్ మెన్ కమిటీ సభ్యులు డిప్యూటీ లేబర్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఈఎ్‌సఐ మేనేజర్ దుర్గాప్రసాద్, డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఫ్యాక్టరీస్ నారాయణరెడ్డి, ఈపీఎఫ్ అధికారి ప్రసాద్ కలిసి తనిఖీలు చేశారు. కార్మికుల ఫీర్యాదులోని పలు అంశాలు పరంగా ఆయా బృందం సభ్యులు లోతుగా పలు రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించారని తెలిసింది. కార్మికులు.. డెయిరీ చైర్మన్ జగన్‌మోహన్‌రెడ్డి తోపాటు తదితర ఉద్యోగులతో సైతం పలు విషయాలపై ఆరా తీశారని తెలిసింది. కార్మికుల పరంగా కార్మికుల చట్టం ప్రకారం పలు నిబంధనలు పాటిం చలేదని గుర్తించినట్లు తెలిసింది. కార్మికుల ఈపీఎఫ్, ఈఎ్‌సఐ తదితర వాటిలో కూడా కొన్ని లోపాలను గుర్తించారని తెలిసింది. మొత్తంగా ఆకస్మిక ఫోర్‌మెన్ కమిటీ మూడు గంటల పాటు చేసిన తనిఖీలలో సదరు డెయిరీలోని లోపాలు ఒక్కసారిగా వెలుగు చూసినట్లైంది.