ఓటీపీతో రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే టెండర్
ABN , Publish Date - Mar 31 , 2026 | 11:03 PM
వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఈ-నామ్ 2.0 వర్షన్‌పై రైతులు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు.
సిబ్బంది ప్రకటనతో అన్నదాతల ఆగ్రహం
మార్కెట్‌యార్డు కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు
ఆదోని అగ్రికల్చర్, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఈ-నామ్ 2.0 వర్షన్‌పై రైతులు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం ఆయా గ్రామాల నుంచి పంట ఉత్పత్తులను విక్రయానికి వచ్చిన రైతులకు ఈ-నామ్ 2.0లో ఆధార్ కార్డుతో పేర్లు నమోదు చేసుకొని సెల్ ఫోన్ల్‌కు వచ్చే ఓటీపీతో రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే టెండర్ పంపుతామని ప్రకటించడంతో ఒక్కసారిగా రైతులంతా మార్కెట్ యార్డ్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆధార్ కార్డు, సెల్‌ఫోన్ తాము తీసుకురాలేదని ఇక్కడకు వచ్చాక తమను ఇబ్బందులకు గురి చేయడం మంచిది కాదంటూ మార్కెట్ యార్డ్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. సహాయ కార్యదర్శి శాంతకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం ఈ-నామ్ సర్వర్ వెర్షన్ మార్పులు చేశారని, ఇందులో తప్పకుండా రైతుల వివరాలు పొందుపరచాల్సి ఉంటుందని చెప్పారు. ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే జీవితకాలం రైతు పేరు వివరాలు ఉంటాయని రైతులకు ఎలాంటి ఇబ్బందులేదని నచ్చజెప్పారు. అనుమానాలు నివృత్తి చేశాకనే అమలు చేయాలని, అప్పటివరకు ఓటీపీ లేకుండా టెండర్లు కుంచే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నిబంధన లేదని, యఽథావిధిగా కొనసాగిస్తామని చెప్పడంతో రైతులు శాంతించి వెనక్కి వెళ్లారు. సర్వర్ మోరాయించడం టెండర్లు ఆలస్యం చేయడంతో తూకాలు ఆలస్యంగా జరిగాయి. సూపర్‌వైజర్లు మోహన్ రెడ్డి, షబ్బీర్ నాగరాజు, అశోక్ పాల్గొన్నారు.