Share News

పది మూల్యాంకనం ఆరంభం

ABN , Publish Date - Apr 06 , 2026 | 11:50 PM

నంద్యాల ఎస్‌డీఆర్‌ పాఠశాలలో పదో తరగతి జవాబుపత్రాల మూల్యాం కనం ప్రారంభమైంది.

పది మూల్యాంకనం ఆరంభం
జవాబు పత్రాలను మూల్యాంకనం చేస్తున్న ఉపాధ్యాయులు

హాజరుకాని ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీస్‌

నంద్యాల ఎడ్యుకేషన్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): నంద్యాల ఎస్‌డీఆర్‌ పాఠశాలలో పదో తరగతి జవాబుపత్రాల మూల్యాం కనం ప్రారంభమైంది. 1,86,489 జవాబుపత్రాలు జిల్లాకు కేటా యించారు. సోమవారం ఉదయం 9గంటలకు ప్రారంభం కావా ల్సివుండగా ఉపాధ్యాయులకు గదుల కేటాయింపు కారణంగా 11గంటలకు మూల్యాంకనం ప్రారంభమైంది. ప్రధానంగా ఫిజిక్స్‌, మ్యాథ్స్‌ జవాబుపత్రాల మూల్యాంకనానికి చాలా మంది ఉపా ధ్యాయులు హాజరు కాలేదు. 448 మంది స్కూల్‌ అసిస్టెంట్లను సహాయ ఎగ్జామినర్‌లుగా, 77 మంది ప్రధానోపాధ్యాయులను చీఫ్‌ ఎగ్జామినర్‌లుగా, 225 మంది ఎస్జీటీలను ప్రత్యేక సహా యకులుగా నియమించారు. మొత్తం 750మంది ఉపాధ్యాయులు హాజరుకావాల్సి వుండగా కొంత మంది ఉపాధ్యాయులు వివిధ కారణాలతో గైర్హాజరయ్యారు. హాజరుకాని ఉపాధ్యాయులకు షో కాజ్‌ నోటీస్‌ జారీ చేయనున్నట్లు డీఈవో జనార్దన్‌రెడ్డి తెలిపారు. పలువురు ఉపాధ్యాయులు అనారోగ్యంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నామంటూ డీఈవోకు వినతి పత్రాలు అందజేశారు. మరికొందరి ఉపాధ్యాయులకు జనగణన విధులు ఉన్నాయంటూ వారికి వచ్చిన ఉత్తర్వులు చూపడంతో వారిని మూల్యాంకనం నుంచి మినహాయించారు. డీఈవో మా ట్లాడు తూ విధులు కేటాయించిన ఉపాధ్యాయులు తప్పకుండా హాజ రుకా వాలని, జనగణన, తీవ్ర అనారోగ్యాలకు గురైన వారిపై విచా రించి తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. అనంతరం మూల్యాంకన సిబ్బందికి స్కాన్‌ చేసేందుకు ట్యాబ్‌లను అందజేశారు.

Updated Date - Apr 06 , 2026 | 11:50 PM