దేవాలయ భూములను కాపాడాలి
ABN , Publish Date - Jan 18 , 2026 | 12:16 AM
దేవాలయాల భూములు ఆక్రమణలకు గురికాకుండా సత్వర చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ కార్తీక్ ఆర్డీవోలు, తహసీల్దార్లను ఆదేశించారు.
జాయింట్ కలెక్టర్ కార్తీక్
నంద్యాల నూనెపల్లి, జనవరి 17 (ఆంధ్రజ్యోతి) : దేవాలయాల భూములు ఆక్రమణలకు గురికాకుండా సత్వర చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ కార్తీక్ ఆర్డీవోలు, తహసీల్దార్లను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జేసీ అధ్యక్షతన దేవాలయ భూ ముల పరిరక్షణ అంశంపై ల్యాండ్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. దేవాలయ భూ ముల పరిరక్షణ బాధ్యత సంబంధిత కార్యనిర్వహణాధికారులపై ఉందన్నారు. రీసర్వే జరుగుతున్న గ్రామాల్లో దేవదాయ శాఖ సిబ్బంది తప్పనిసరిగా పాల్గొని దేవాలయాల పేర్లు పొరపాట్లు లేకుండా నమోదు చేయించుకోవాలని సూచించారు. దేవదాయ భూముల పేర్లను ఆన్‌లైన్‌లో మ్యూటేషన్ చేయించే విధంగా తహసీల్దార్లకు సూచనలు జారీ చేయాలని ఆర్డీవోలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల, బనగానపల్లి, డోన్, ఆత్మకూరు ఆర్డీవోలు విశ్వనాథ్, నరసింహులు, శివనాగజ్యోతి పాల్గొన్నారు.