Share News

దళితులకు ఆలయ ప్రవేశం

ABN , Publish Date - Jun 05 , 2026 | 11:32 PM

మండలంలోని సోమయాజులపల్లె గ్రామంలోని సుంకులమ్మ, ఆంజనేయస్వామి ఆలయాల్లో అధికారుల సమక్షంలో దళితులకు ఆలయ ప్రవేశం చేయించారు.

దళితులకు ఆలయ ప్రవేశం
సోమయాజులపల్లెలో ఆలయంలో పూజలు చేస్తున్న దళితులు

ఓర్వకల్లు, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): మండలంలోని సోమయాజులపల్లె గ్రామంలోని సుంకులమ్మ, ఆంజనేయస్వామి ఆలయాల్లో అధికారుల సమక్షంలో దళితులకు ఆలయ ప్రవేశం చేయించారు. జిల్లా బీజేపీ కార్యదర్శి, ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్‌ కమిటీ సభ్యురాలు గొందిపర్ల మాలతి, ఆమె భర్త రామాంజనేయులుతో కర్నూలు ఆర్డీవో సందీప్‌ కుమార్‌, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సునీల్‌కుమార్‌రెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగరాజు సమక్షంలో ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. వారు మాట్లాడుతూ ఐదు నెలల క్రితం సంక్రాంతి పండుగ సందర్బంగా సుంకులమ్మ ఆలయంలో పూజలు చేసేందుకు వెళ్లిన గొందిపర్ల మాలతిని, కుటుంబ సభ్యులను ఆలయ పూజారి ప్రవేశం లేదంటూ అడ్డుకున్నారని తెలిపారు. ఈవిషయంపై ఓర్వకల్లు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లగా.. దళితులకు ఆలయ ప్రవేశం కల్పించేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగానే ఆర్డీవో సందీప్‌ కుమార్‌ సమక్షంలో గొందిపర్ల మాలత, భర్త రామాంజ నేయులును ఆలయంలోకి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ఆలయ ప్రవేశం కల్పించడం పట్ల సంతోషం వ్యక్తం చేసి ప్రతి ఒక్కరికి ఆలయ ప్రవేశం చేసే హక్కు ఉందన్నారు. ఆర్డీవో సందీ్‌పకుమార్‌తో పాటు సహకరించిన అధికారులను బీజేపీ నాయకులను గొందిపర్ల మాలతి, రామాంజనేయులు సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Jun 05 , 2026 | 11:32 PM