మంత్రాలయంలో 35 డిగ్రీల ఉష్ణోగ్రత
ABN , Publish Date - Sep 10 , 2026 | 11:15 PM
మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శ నార్థం వస్తున్న భక్తులు ఎండ వేడిమికి విలవిలలాడుతున్నారు.
ఎండ వేడిమికి భక్తులు విలవిల
మంత్రాలయం, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శ నార్థం వస్తున్న భక్తులు ఎండ వేడిమికి విలవిలలాడుతున్నారు. గురువారం మంత్రాలయంలో 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 10గంటల నుంచి సాయం త్రం 5గంటల దాకా గ్రామస్థులు, భక్తులు తమ గదుల నుంచి బయటకు రావడంలేదు. ఎప్పుడూ రద్దీగా ఉండే మధ్వమార్గ్, తుంగభద్రనది కారిడార్, రాఘవేంద్ర, అంబేడ్కర్ సర్కిళ్లు, ప్రధానరోడ్లు, సంస్కృత వేదపాఠశాల కారిడార్ నిర్మానుష్యంగా మారాయి. దర్శనానికి వెళ్లే భక్తులు గొడుగులు, టోపీలు, టవాళ్లు కప్పుకుని వెళ్తున్నారు. శీతల పానీయాలు సేవిస్తూ ఎండ నుంచి ఉపశమనం పొందుతున్నారు. ఏసీ గదులకు డిమాండ్ పెరిగింది.