Share News

వాస్తవాలు చెప్పండి

ABN , Publish Date - Mar 14 , 2026 | 11:43 PM

ఉమ్మడి జిల్లాలో రిజర్వాయర్లను నింపే విషయంలో వాస్తవాలను చెప్పా లని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి జలవనరుల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

వాస్తవాలు చెప్పండి
మాట్లాడుతున్న జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి

జలవనరుల అధికారిపై జడ్పీ చైర్మన్‌ ఆగ్రహం

ముగిసిన స్థాయి సంఘ సమావేశాలు

కర్నూలు న్యూసిటీ, మార్చి 14(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలో రిజర్వాయర్లను నింపే విషయంలో వాస్తవాలను చెప్పా లని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి జలవనరుల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మినీ సమా వేశం భవనంలో ఏడు స్థాయి సంఘ సమావేశాలు చైర్మన్‌ అధ్యక్షతన నిర్వహించారు. సీఈవో జి.నాసరరెడ్డి పర్యవేక్షిం చారు. జలవనరుల అధికారి మాట్లాడుతూ 92 చెరువులు నింపామనగా, చైర్మన్‌ స్పందిస్తూ ఉమ్మడి జిల్లాలో ఉండేది కేవలం 77 చెరువులే అని, 92 చెరువులను ఎలా నింపారని మండిపడ్డారు. అవుకు రిజర్వాయర్‌కు మరమ్మతులు చేయా లని, గత సంవత్సరం తాగునీటి ఎద్దడి నివారించేందుకు ఆర్‌డ బ్ల్యూఎస్‌ అధికారులు సుమారు 42 పనులు మంజూరు చేయించు కున్నారని ఇప్పటి వరకు ఎందుకు పూర్తి చేయలేదని, ఇంకా 9 పనులు పెండింగ్‌ ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు. కేసీ కెనాల్‌ కింద పంటలు వేసుకున్న రైతులకు నీరివ్వాలని, ఈ సంవత్సరం వర్షాలు విస్తారంగా కురిసినా ఖరీఫ్‌లో నీరు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారని అన్నారు. ఆర్‌ అండ్‌ బీ, పంచాయతీరాజ్‌కు సంబంధించి రహదారులను నిర్మించే సమయంలో తప్పకుండ ప్రమాద సూచికలు ఏర్పాటుచేయాలని సూచించచారరు. గ్రా మాల్లో మురుగు ఉంకుండ అధికారులు చర్యలు తీసుకోవాలని, కాలువలను శుభ్రం చేయడంతో పాటు కొత్తగా కాలువలను నిర్మించే విధంగా ప్రతిపాదనలు పంపాలన్నారు. పాఠశాలలకు వెళ్లి, అధికారులు ప్రతిరోజు మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించాలన్నారు. ఉమ్మడి జిల్లాలో యూరియా కొరత రాకుండా చూడాలన్నారు. డిప్యూటీ సీఈవో వెంకటసుబ్బారెడ్డి, ఉమ్మడి జిల్లాల అధికారులు, జడ్పీటీసీలు పాల్గొన్నారు.

Updated Date - Mar 14 , 2026 | 11:43 PM