మల్లన్న సేవలో తెలంగాణ హైకోర్టు జడ్జి
ABN , Publish Date - Nov 30 , 2026 | 12:06 AM
నంద్యాల జిల్లాలోని శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ తంగిరాల మాధవి దంపతులు ఆదివారం దర్శించుకున్నారు.
శ్రీశైలం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లాలోని శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ తంగిరాల మాధవి దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. ముందుగా ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకున్న వీరికి ఈవో శ్రీనివాసరావు, చైర్మన్ రమేశ్ నాయుడు సంప్రదాయానుసారం వేదపండితులతో తిలకధారణ చేయించి పూలమాలతో స్వాగతం పలికారు. ప్రధాన ధ్వజస్తంభానికి నమస్కరించుకున్న న్యాయమూర్తి దంపతులు స్వామి, అమ్మవార్లకు పంచామృతాభిషేకాలు ప్రత్యేక పూజలు చేసుకుని పరివార దేవతాలయాలను దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారి ప్రాకార మండపంలో న్యాయమూర్తి దంపతులకు అర్చక వేదపండితులు వేదాశీర్వచనాలు పఠించి స్వామి, అమ్మవార్ల తీర్థప్రసాదాలు, లడ్డూ ప్రసాదాలు, పరిమళ విభూది, శ్రీశైల వైభవాన్ని చూపే కాఫీ టేబుల్ బుక్ అందించి శేషవస్త్రాలతో సత్కరించారు.