మల్లన్న సన్నిధిలో తెలంగాణ హైకోర్టు జడ్జి
ABN , Publish Date - Jul 12 , 2026 | 11:35 PM
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను తెలంగాణ హైకోర్టు జడ్డి జస్టిస్ శరత్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
శ్రీశైలం, జూలై 12 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను తెలంగాణ హైకోర్టు జడ్డి జస్టిస్ శరత్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆదివారం ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకున్న వారికి అధికారులు, అర్చకపండితులు సంప్రదాయానుసారం తిలకధారణ చేసి పూలమాలతో స్వాగతం పలికారు. ప్రధాన ధ్వజస్తంభ నమస్కారం చేసుకున్న వారు స్వామికి పంచామృతాభిషేకాలు, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసుకుని పరివార దేవతాలయాలను కూడా దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారి ప్రాకార మండపంలో అర్చక వేదపండితులు వేదాశీర్వచనాలు పఠించి స్వామి, అమ్మవార్ల తీర్థప్రసాదాలు, లడ్డూ ప్రసాదాలు, పరిమళ విబూధి, జ్ఞాపికను అందించి శేషవస్త్రాలతో సత్కరించారు.