Share News

ఈనామ్‌-2లో సాంకేతిక సమస్య

ABN , Publish Date - Apr 04 , 2026 | 11:24 PM

రైతులు పంట ఉత్పత్తులను అమ్ముకునేందుకు కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ఈనామ్‌-2 విధానం సక్రమంగా జరగకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు.

ఈనామ్‌-2లో సాంకేతిక సమస్య
మ్యానువల్‌ పద్ధతిలో టెండర్‌ ప్రక్రియను పరిశీలిస్తున్న మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ శేషగిరిశెట్టి

మ్యానువల్‌గా టెండర్‌ ప్రక్రియ

హర్షం వ్యక్తం చేసిన రైతులు

కర్నూలు అగ్రికల్చర్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): రైతులు పంట ఉత్పత్తులను అమ్ముకునేందుకు కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ఈనామ్‌-2 విధానం సక్రమంగా జరగకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. శనివారం ఈవిధానం అమలులో సాంకేతిక కార ణాలు చోటు చేసుకోకపోవడంతో పంట ఉత్పత్తుల విక్రయాలకు సంబం ధించి టెండర్‌ ప్రక్రియ నిలిచిపోయే పరిస్థితి ఎదుర్కొంది. దీంతో కర్నూలు మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ శేషగిరిశెట్టి, అసిస్టెంట్‌ సెక్రటరీ వెంకటేశ్వర్లు, సూపర్‌వైజర్లు కేశవరెడ్డి, శివన్న, నగేష్‌తో పాటు అకౌంటెంట్‌ కిషన్‌రెడ్డి మ్యానువల్‌ పద్ధతిలో టెండర్‌ ప్రక్రియను నిర్ణయించేందుకు వెంటనే నిర్ణయం తీసుకున్నారు. పంట ఉత్పత్తుల క్రయ విక్రయాలు వెంటనే కొన సాగాయి. రైతులు సంతోషం వ్యక్తం చేశారు.

Updated Date - Apr 04 , 2026 | 11:24 PM