Share News

ఆర్టీసీ బస్సుల్లో సాంకేతిక లోపం..

ABN , Publish Date - Mar 29 , 2026 | 12:07 AM

ఏపీఎస్‌ ఆర్టీసీ ఎమ్మిగనూరు డిపోకు చెందిన రెండు ఆర్టీసీ బస్సుల్లో శనివారం సాంకేతిక లోపాలు తలెత్తాయి. అందులో ఒక బస్సు ఎమ్మిగనూరు పట్టణంలోని శివసర్కిల్‌లో రోడ్డుకు అడ్డంగా నిలిచిపోగా, మరో బస్సు నందవరం గ్రామ సమీపంలోని పోలాల్లోకి దూసుకెళ్లింది.

ఆర్టీసీ బస్సుల్లో సాంకేతిక లోపం..
నందవరం సమీపంలో పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ఎమ్మిగనూరు శివసర్కిల్‌ రోడ్డుకు అడ్డంగా నిలిచిన బస్సు

నందవరం పొలాల్లో, ఎమ్మిగనూరులో రోడ్డుకు అడ్డంగా నిలిచిన బస్సులు

ఎమ్మిగనూరు, మార్చి 28(ఆంధ్రజ్యోతి): ఏపీఎస్‌ ఆర్టీసీ ఎమ్మిగనూరు డిపోకు చెందిన రెండు ఆర్టీసీ బస్సుల్లో శనివారం సాంకేతిక లోపాలు తలెత్తాయి. అందులో ఒక బస్సు ఎమ్మిగనూరు పట్టణంలోని శివసర్కిల్‌లో రోడ్డుకు అడ్డంగా నిలిచిపోగా, మరో బస్సు నందవరం గ్రామ సమీపంలోని పోలాల్లోకి దూసుకెళ్లింది. ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపోనుంచి కర్నూలుకు బయలుదేరిన ఏపీ03జెడ్‌ 0365 బస్సు శిసర్కిల్‌లోకి రాగానే ఉన్నట్టుండి ఎయిర్‌ లాక్‌ అయింది. దీంతో డ్రైవర్‌ వెంటనే డిపోకు తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే క్రమంలో శివసర్కిల్‌లో రోడ్డుకు అడ్డంగా నిలిచిపోవటంతో ప్రయాణికులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నిత్యం రద్దీగా ఉండే సర్కిల్‌లో బస్సు ఆదోని రోడ్డుకు అడ్డంగా నిలిచి పోవటంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న డిపోకు చెందిన మెకానిక్‌లు వచ్చి పరిశీలించి స్థానికుల సాయంతో బస్సును డిపోకు తరలించారు. అలాగే నందవరం సమీపంలో విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ దగ్గర నాగలదిన్నె వైపు నుంచి ఎమ్మిగనూరుకు వస్తున్న ఏపీ 21 జెడ్‌ 0275 బస్సు బ్రేక్‌ జామ్‌ కావటంతో పోలాల్లోకి దూసుకెళ్లింది. డ్రైవర్‌ చాకచక్యంగా నిలిపివేయటంతో ప్రమాదం తప్పింది. కాగా ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపోలో ఇలాంటి బస్సులు మరి కొన్ని ఉన్నాయని, ఎక్కడ పడితే అక్కడ నిలిచిపోతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. వాటి స్థానంలో కొత్త బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ప్రయాణికులు, ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Updated Date - Mar 29 , 2026 | 12:07 AM