Share News

అన్నదాతకు కన్నీటికష్టాలు

ABN , Publish Date - May 02 , 2026 | 12:20 AM

కొద్ది రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో బోరు బావులు వట్టిపోతున్నాయి.

అన్నదాతకు కన్నీటికష్టాలు
పశువులకు వదిలేసిన పంటను చూపుతున్న రైతు సూర్యనారాయణరెడ్డి,

అధిక ఉష్ణోగ్రతలతో అడుగంటిన భూగర్భ జలాలు

ఎండిపోతున్న పంటలు

కొలిమిగుండ్ల, మే 1 (ఆంధ్రజ్యోతి): కొద్ది రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో బోరు బావులు వట్టిపోతున్నాయి. దీంతో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని ఉమ్మాయిపల్లె గ్రామంలో సుమారు వంద ఎకరాల్లో 40మంది రైతులు మిర్చి, టమోటా, మొక్క జొన్న సాగు చేశారు. బోర్లలో నీరులేక పంటలు కళ్లముందే ఎండిపోతున్నాయి. దీంతో కొందరు రైతులు పంటలను పశువుల మేతకు వదిలేయగా, మరి కొందరు నూతన బోరు వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటికే పంటలు ఎండిపోవడతో ఏమి చేయాలో తోచడం లేదని ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధిత రైతులు గోపాల్‌రెడ్డి, సూర్యనారాయణరెడ్డి, ఆదినారాయణరెడ్డి, నరసింహారెడ్డి, ఓబుల్‌రెడ్డి, గంగయ్య, నారాయణ విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - May 02 , 2026 | 12:20 AM